అదో అందమైన దీవి.. కానీ అడుగు పెడితే తిరిగి రారు.. ఇప్పటికే శవాలు గుట్టల్లా పేరుకుపోయాయి! - TNews Telugu

అదో అందమైన దీవి.. కానీ అడుగు పెడితే తిరిగి రారు.. ఇప్పటికే శవాలు గుట్టల్లా పేరుకుపోయాయి!unknown facts about Poveglia island
unknown facts about Poveglia island

నీటిపై తేలియాడే అందమైన నగరంగా వెనీస్ సిటీ ప్రపంచంలో అందరికీ సుపరిచితమే. ఆ అందమైన నగరానికి జస్ట్ 16 కి.మీ దూరంలో ఓ అందమైన దీవి ఉందనే విషయం కూడా తెలుసు. కానీ.. ఆ దీవికి వెళ్లేందుకు మాత్రం ఎవరూ ధైర్యం చేయరు. ఒకవేళ సాహసం చేసి అడుగు ముందుకేసి దీవిలోకి వెళ్తే.. అటే.. తిరిగి రారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి అక్కడి ప్రభుత్వం సైతం జంకుతోంది. అసలు అధికారులే అక్కడికి వెళ్లాలంటే వణికిపోతున్నారు. మరి సాధారణ ప్రజల సంగతేంటి? అసలు ఆ అందమైన దీవిలో అడుగు పెట్టేందుకే ఎందుకు వణికిపోతున్నారు. అసలక్కడ ఏముంది?

unknown facts about Poveglia island
unknown facts about Poveglia island

అందరూ భయపడే ఆ అందమైన దీవి పేరు పోవెగ్లియా. కానీ.. ఇటలీ దేశ ప్రజలు ఆ దీవిని ఒక స్మశానంలా చూస్తారు. శవాల దిబ్బ అని పిలుస్తారు.అయితే.. ఇప్పుడది స్మశానం కాదు. కానీ.. ఒకప్పుడు ప్లేగు వ్యాధి సోకి నరకయాతన అనుభవించిన బాధితుల ఆర్తనాదాలతో మారుమోగిన నరకం ఆ దీవి. 16వ శతాబ్దంలోనే దాదాపు లక్షమంది ప్లేగు వ్యాధి సోకి.. అక్కడ ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారని ప్రచారం. అందుకు సాక్ష్యంగా గుట్టల కొద్ది అస్థిపంజరాలు కూడా దర్శనమిస్తాయి. అయితే.. ఆ భయంతో అక్కడ ప్రజలు నివసించడం మానేశారు. వెనీస్ నగరాన్ని చూసేందుకు వచ్చే చాలామంది పర్యాటకుల్లో ఆ దీవిని చూసేందుకు వెళ్లారు. కానీ.. ఇప్పటి వరకు ఆ దీవిలోకి అడుగు పెట్టిన ఎవరూ తిరిగి రాలేదు.

unknown facts about Poveglia island
unknown facts about Poveglia island

అసలా దీవిలో ఏం జరుగుతోంది?
ఇంతకీ ఆ దీవిలో ఏ జరిగింది? ఏం జరుగుతోంది? ఇప్పటికీ ఆ దీవిలోకి వెళ్లేందుకు జనాలు ఎందుకు భయపడుతున్నారు. 16వ శతాబ్దంలో ఇటలీని ప్లేగు వ్యాధి కబళించింది. వ్యాధి సోకిన వారిని అక్కడే ఉంచితే.. మరింతమందికి వైరస్ సోకి చనిపోతారన్న ఉద్ధేశ్యంతో రోగులను, వ్యాధితో చనిపోయిన రోగులను తీసుకెళ్లి పోవేగ్లియాలో వదిలేశారు. దీంతో.. వ్యాధితో చనిపోయిన శవాల మధ్యే రోగులు కూడా ఉండేవారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉండేవారు. టెక్నాలజీ, వైద్య సదుపాయాలు అంతగా లేకపోవడం వల్ల వ్యాధి సోకిన వారికి మరణమే గతి. రోగులు ఆ శవాల మధ్యే జీవించేవారు. తిండి లేక, రోగానికి చికిత్స లభించక అక్కడే చనిపోయేవారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ అరాచకాన్ని అప్పట్లో పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఏం చేయలేని పరిస్థితి. ఎన్నో పోరాటాల తర్వాత ప్రభుత్వం అక్కడ ఒక చర్చితోపాటు రోగులు ఉండేందుకు ఓ భవనం నిర్మించింది. వేల సంఖ్యలో చనిపోయిన రోగులను ఆ దీవిలోనే సామూహికంగా పూడ్చిపెట్టేశారు. స్థలం లేకపోవడంతో మిగతా శవాలను దహనం చేశారు.

unknown facts about Poveglia island
unknown facts about Poveglia island

మళ్లీ ఆ దీవిని 1920లో పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ఇటలీ ప్రభుత్వం ప్రయత్నించింది. అక్కడ ఉండేవారికి ఏర్పాట్లు చేయాలని కూడా అనుకుంది. కానీ ప్రజలు అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపలేదు. దీంతో అక్కడ ఓ మెంటల్ ఆసుపత్రి నిర్మించారు. అప్పటి నుంచి అక్కడి పరిస్థితులు మరింత భయానకంగా మారిపోయాయి. ఆ హాస్పిటల్‌లోని ఓ డాక్టర్ అక్కడి రోగులపై రకరకాల ప్రయోగాలు చేసేవాడు. చిత్రహింసలకు గురిచేసి చంపేసి శవాల ఆనవాళ్లు కూడా లేకుండా చేసేవాడు. అతను కాకి ముక్కు తరహా మాస్క్ పెట్టుకొని తిరిగేవాడని అప్పటి ప్రజలు చెప్పేవారు. కొంతమంది రోగులు అక్కడ తమకు ఆత్మలు కనిపిస్తున్నాయని చెప్పినా, వారిని మానసిక రోగులుగా చూసేవారు కానీ.. ఎవరూ నమ్మేవారు కాదట. కొద్దిరోజుల తర్వాత డాక్టర్‌కు కూడా అక్కడ ఆత్మలు కనిపించాయి. వాటిలో అతడి పరీక్షలకు బలైన రోగులు కూడా అతడికి కనిపిస్తున్నారని చెప్పేవాడట. ఒకరోజు ఆ డాక్టర్ కూడా దీవిలో ఉన్న టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అమాయకులను చంపినందుకు ఆత్మలే అతడిని చంపేశాయనే ప్రచారం కూడా జరిగింది.

unknown facts about Poveglia island
unknown facts about Poveglia island

ఎంతో అందంగా ఉండే ఆ దీవిని పర్యటకానికి వినియోగించుకోవాలనే ప్రయత్నాలు చాలాసార్లు జరిగాయి. కానీ.. అక్కడ జరిగిన సంఘటనలు పాలకులను అడుగు ముందుకు పడనివ్వలేదు. కొత్తగా భవనాలు నిర్మించడానికి తవ్వకాలు జరిపితే.. వేలసంఖ్యలో శవాల గుట్టలు బయటపడ్డాయి. దీంతో పాటే.. అక్కడ ఆత్మలు తిరుగుతున్నాయన్న వార్తలతో ఇటలీ ప్రభుత్వం ఆ దీవిలోకి ప్రవేశం నిషేదించింది. అయితే, ఏకాంతం కోరుకునేవారు.. వెనీస్ నుంచి ఈ దీవికి పడవల్లో వెళ్లేవారని.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వారి కోసం గాలించగా శవాలై కనిపించే వారని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడ వింత వింత శబ్ధాలు వినిపిస్తాయని,ర అక్కడ ఎవరూ లేకపోయినా టవర్ లో, చర్చిలో గంటలు మోగుతుంటాయని వెనీస్ నగరం సమీపంలో ఉండేవారు చెప్తుంటారు. అందుకే ఆ ప్రాంతంలోకి పర్యాటకులను నిషేధించారు. అయితే.. సాహసం చేసి ఎవరైనా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకుంటే.. కొన్ని దరఖాస్తులు పూర్తి చేయాలనే నిబంధన పెట్టారు. ఆ దీవిలో ఏం జరిగినా అక్కడి ప్రభుత్వానికి సంబంధం లేదనే డిక్లరేషన్ ఇవ్వాలి. దెయ్యాల కోసం అన్వేషించే వారికి ఈ దీవి ఫేవరెట్ ప్లేస్. ప్రస్తుతం ఈ దీవిని లుగి బ్రుగనరో అనే వ్యాపారవేత్త వేలం వేసి 7.04 లక్షల డాలర్లకు 99 ఏళ్లకు లీజు తీసుకున్నాడు.