చలికాలంలో బైక్ తొందరగా స్టార్ట్ కావడం లేదా.. అయితే ఇలా చేయండి

Use this easy Tips For bike starting Problems in winter
Use this easy Tips For bike starting Problems in winter

చలికాలం వచ్చిందంటే చాలు.. అటు ఆరోగ్య, చర్మ సమస్యలతో పాటు.. ఇతర సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సీజన్ లో పొద్దున్నే లేచి ఏదైనా పని కోసం బయటకు వెళ్లాలని బైక్, కార్ స్టార్ట్ చేస్తే తొందరగా స్టార్ట్ కాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ చలికాలంలో మీ బండి కూడా స్టార్ట్ కాకుండా అలా ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి.

ఈ సీజన్ లో పొద్దుపొద్దున్నే మీ బైక్ స్టార్ట్ కావడం లేదా? చాలామంది పొద్దున్నే బండి స్టార్ట్ చేసేటప్పుడు సెల్ఫ్ స్టార్ట్ చేస్తుంటారు. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకంటే రాత్రంతా ఇంజిన్ ఆఫ్ చేసి ఉంటుంది. చలికి బ్యాటరీ పూర్తిగా కూల్ అయిపోయి ఉంటుంది. అందుకే.. పొద్దున్నే సెల్ఫ్ బటన్ తో కాకుండా కిక్ కొట్టి స్టార్ట్ చేయాలి. బ్యాటరీ ఒకసారి ఆన్ అయి వేడి అయిన తర్వాత బటన్ తో స్టార్ట్ చేసుకోవచ్చు.


బైక్ పార్ట్స్ లో ముఖ్యమైనది స్పార్క్ ప్లగ్. ఇది సరిగ్గా పనిచేయకపోతే బైక్ స్టార్ట్ కాదు.. ఒక్క ఇంచుకు కూడా ముందుకు కదలదు. కాబట్టి ఎప్పటికప్పుడు స్పార్క్ ప్లగ్ క్లీన్ చేయండడి. చలికాలంలో మంచు, చలి వల్ల స్పార్క్ ప్లగ్ జామ్ అవుతుంది. బైక్ సీట్ కింద ఉండే టూల్ కిట్ తో స్పార్క్ ప్లగ్ క్లీన్ చేసుకోవచ్చు.


పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేస్తుంటే బైక్ స్టార్ట్ కావడం లేదా? ఇంతకు ముందు చెప్పుకున్నట్టు చలికాలంలో బండి ఇంజిన్ తో పాటు బ్యాటరీ, ప్లగ్ అన్నీ జామ్ అయి కూల్ అయిపోయి ఉంటాయి. సో.. చలికాలంలో పొద్దుపొద్దున్నే బైక్ స్టార్ట్ కాకపోతే.. చోక్ ఆన్ చేసి కిక్ కొట్టండి. స్టార్ట్ అవుతుంది.


బైక్ లో ఇంజిన్ ఆయిల్ తక్కువ అయినా కూడా బండి స్టార్ట్ కాదు. చలికాలంలో ఆ ఎఫెక్ట్ మరింత ఉంటుంది. అందుకే.. బైక్ లో ఎప్పటికప్పుడు ఆయిల్ మారుస్తూ ఉండాలి. చలికాలం వచ్చిందంటే ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకొండి. పలు పార్ట్స్ లో పేరుకుపోయిన కార్బన్ క్లీన్ చేయించండి.


చలికాలంలో రోజూ బండి తీసే అవసరం లేకపోయినా సరే.. రోజుకు రెండుసార్లు బండి స్టార్ట్ చేసి.. కొద్దిసేపు ఉంచి మళ్లీ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల బండి స్టార్టింగ్ సమస్యరాదు.