నా కంటే ముందే తమ్ముడి పెళ్లి.. ఆ సీక్రెట్ చెప్పేసిన విజయ్ దేవరకొండ..!

Vijay Devarakonda About His Marriage In Pushpaka Vimanam Movie Promotions
Vijay Devarakonda About His Marriage In Pushpaka Vimanam Movie Promotions
Vijay Devarakonda About His Marriage In Pushpaka Vimanam Movie Promotions
Vijay Devarakonda About His Marriage In Pushpaka Vimanam Movie Promotions

ప్రభాస్, అఖిల్, విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరంటే అందరు టక్కున చెప్పేవి ఈ మూడు పేర్లే. ఇందులో ప్రభాస్ పెళ్లి అంటూ గడిచిన 10సంగా వింటూనే ఉన్నాం. కానీ డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇప్పటివరకు ఎలాంటి శుభవార్త లేదు. ఇక అక్కినేని అందగాడు అఖిల్ అప్పట్లోనే ఎంగేజ్మెంట్ చేసుకుని అర్దాంతరంగా క్యాన్సిల్ చేసుకున్నాడు. హీరోగా పూర్తిస్థాయిలో సెట్ అయ్యాకే తన పెళ్లి అంటూ కూడా ఖరాకండిగా చెప్పేశాడు అక్కినేని అఖిల్. ఇక తొలిసారి పెళ్లి ఎప్పుడు అనే రూమర్స్ లోకి వచ్చేసిన మరోపేరు విజయ్ దేవరకొండ. కొద్దిరోజులుగా విజయ్ రేలషన్స్ పై ఒకటే న్యూస్ లు వస్తున్నాయి. ఇప్పటికే ఒక స్పానిష్ అమ్మాయితో విజయ్ డేటింగ్ చేస్తున్నాడని.. తనతోనే పెళ్లి అంటూ పుకార్లు వస్తున్నాయి. ఈ గాసిప్స్ పై తాజాగా రౌడీ స్పందించాడు. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా చేస్తున్న మూడవ చిత్రం పుష్పక విమానం.

శాన్వి మేఘ‌న‌, గీత సైనీ హీరోయిన్లుగా.. దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదలకి సిద్ధం అవుతున్న నేపథ్యంలో తమ్ముడి కోసం అప్పుడే ప్రమోషన్స్ షురూ చేశాడు రౌడీ. ఈ క్రమంలో దేవరకొండ బ్రదర్స్‌ ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌‌లో పాల్గొన్నారు. దానికి సంబదించిన వీడియోలో ఒక తమ లైఫ్ లోని ఆసక్తికరమైన సంఘటనలని అన్నదమ్ములు ఇద్దరు పంచుకున్నారు. అయితే ఈ వీడియోలో తన తమ్ముడి పెళ్లి తన కంటే ముందే అవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇది ఫన్నీగా చేశాడో.. లేక సీరియస్ ఇంటెన్షన్ ని లైటర్ వేలో అలా చెప్పాలని చెప్పాడో కానీ ప్రస్తుతం ఈ ఆనంద్ దేవరకొండ పెళ్లి టాపిక్ మాత్రం ఈ వీడియోకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అయితే పెద్ద సంఖ్యలో అబ్బాయిల ఫాలోయింగ్ ఉన్న హీరొయిన్స్.. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోలు తమ మార్కెట్ దృష్ట్యా లెట్ మ్యారేజెస్ కె ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. మరి చూద్దాం నిజంగానే విజయ్ చెప్పినట్టు తనకంటే ముందే ఆనంద్ దేవరకొండ పెళ్లి అవుతుందా లేదా రౌడీనే ముందర పెళ్లిపీటలెక్కుతాడో.