డ్రగ్స్ కేసులో విజయ్ దేవరకొండ ‘లైగర్’ హీరోయిన్ అన‌న్య‌పాండే.. ఎన్సీబీ స‌మ‌న్లు.. ఆర్య‌న్ కేసుతో అన‌న్య‌కు సంబంధం..!

Ananya With Her Father Chanki Panday
Ananya With Her Father Chanki Panday

బాలీవుడ్ నటి అన‌న్య‌పాండేకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు స‌మ‌న్లు జారీ చేసింది. ఎన్సీబీ బృందం ముంబైలోని అన‌న్య‌ నివాసానికి వెళ్లి స‌మ‌న్లు అంద‌జేసింది. అన‌న్య‌పాండేను ఎన్సీబీ విచారించనుంది. ప్ర‌ముఖ న‌టుడు చుంకీపాండే కూతురైన అన‌న్య‌పాండే ప‌లు హిందీ చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ,  పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లైగ‌ర్ సినిమాలో నటిస్తోంది.

ఆర్య‌న్ కేసుతో అన‌న్య‌పాండేకు ఏమైనా లింక్ ఉందా..? అంటూ వార్త‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  బాలీవుడ్ న‌టుడు షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. షారుక్‌ఖాన్ ఇంటి (మ‌న్న‌త్‌)కి వెళ్లి త‌నిఖీలు కూడా చేశారు. మరోవైపు ఆర్య‌న్‌ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్ర‌యించాడు. అక్టోబ‌ర్ 26 ఈ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రుగనున్న విషయం తెలిసిందే.