రోడ్డున పడ్డ విజయ్‌మాల్యా.. ఇళ్లు ఖాళీ చేయాలన్న కోర్టు

Vijay Mallya, fugitive liquor businessman, faces eviction from luxury home in London

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరోసారి చిక్కుల్లో పడ్డారు. లండన్ నగరంలోని విలాసవంతమైన ఇంటిని ఖాళీ చేయాలని బ్రిటన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లండన్ నగరంలోని రీజెంట్స్ పార్కుకు ఎదురుగా ఉన్న కార్న్ వాల్ టెర్రెస్ లగ్జరీ అపార్టుమెంటులో విజయ్ మాల్యా తన కుమారుడు సిద్ధార్థ్, అతని తల్లి లలితతో కలిసి నివశిస్తున్నారు. రుణం చెల్లించక పోవడం వల్ల ఇల్లు ఖాళీ చేయాలని యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రుణం చెల్లించడానికి సమయమివ్వాలని కోరుతూ విజయ్ మాల్యా న్యాయవాదులు చేసిన అభ్యర్థనను యూకే హైకోర్టు ఛాన్సరీ విభాగం సిట్టింగ్ జడ్జి తిరస్కరించారు.

విజయ్ మాల్యాకు లండన్ నగరానికి ఉత్తరాన హెర్టఫోర్డ్ షైర్ లో విశాలమైన కంట్రోహోం సహా పలు ఆస్తులున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పతనానికి సంబంధించి రూ.9,000 కోట్ల మోసానికి పాల్పడిన మాల్యా బ్రిటన్‌కు పారిపోయినప్పటి నుంచి లండన్‌లో నివసిస్తున్నారు.మూడేళ్లపాటు సాగిన విచారణల అనంతరం యూకే హైకోర్టు అతడిని అప్పగించాలని ఆదేశించింది.