బీజేపీలో చేరిన దివంగత CDS బిపిన్ రావత్ సోదరుడు

Vijay Rawat, brother of late CDS General Bipin Rawat, joins BJP

దివంగత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్ రావత్ సోదరుడు, రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రావత్ పోటీ చేయవచ్చని వర్గాల సమాచారం.

ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ బీజేపీలో చేరే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత నాన్న బీజేపీలో ఉండడంతో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచన చాలా తెలివైనది మరియు భవిష్యత్ వాదమన్నారు. కల్నల్ రావత్ తన కుటుంబం, బీజేపీ సిద్ధాంతాలు చాలా పోలి ఉంటాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో చేరి ప్రజాసేవ చేయాలనుకుంటున్నామన్నారు. పార్టీ ఆమోదం లభిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ రావత్ బీజేపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతేడాది తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక, 12 మంది సాయుధ దళాల సిబ్బంది మరణించారు.