ఐపీఎల్‌లో 6500 రన్స్ చేసిన ఫస్ట్ క్రికెటర్ కోహ్లీ

Virat Kohli

ఈసారి ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు వచ్చి చేరింది. నిన్న(శుక్రవారం) పంజాబ్‌ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే సింగిల్ తీసిన కోహ్లీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6,500 రన్స్ చేశాడు. దీంతో ఆ ఘనత దక్కించుకున్నమొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మరోమారు విఫలమైన ఈ మాజీ కెప్టెన్ కోహ్లీ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి 236 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 220 మ్యాచ్‌లు ఆడి 16.22 సగటుతో 6,519 పరుగులు చేశాడు.

ఇందులో 5 సెంచరీలు, 43 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్ (6,186) ఉన్నాడు. ఐపీఎల్‌ లో 6 వేల రన్స్ మైలురాయిని దాటిన ఆటగాళ్లు ఇప్పటి వరకు వీరిద్దరే. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (5,876), రోహిత్ శర్మ (5,829), సురేశ్ రైనా (5,528) ఉన్నారు.