టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై

Why Kohli Retires

భారత టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. ఈ మేరకు కోహ్లీ ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓడిపోయిన ఒక రోజు తర్వాత కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

“టీమ్‌ని సరైన దిశలో తీసుకెళ్లడానికి 7 సంవత్సరాలుగా కష్టపడి, శ్రమించి, ప్రతిరోజు పట్టుదలతో పనిచేశాను. నేను పూర్తి నిజాయితీతో ఆ పనిని చేశాను. ప్రతి విషయం ఏదో ఒక దశలో ఆగిపోవాలి. భారత టెస్టు కెప్టెన్‌గా ఇది ఇప్పుడు’ అని కోహ్లీ చెప్పాడు.

భారత కెప్టెన్‌గా తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, సహచరులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. “ఇంత సుదీర్ఘ కాలం పాటు నా దేశాన్ని నడిపించే అవకాశాన్ని నాకు కల్పించినందుకు BCCIకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు అండగా నిలిచిన సహచరులను ఎన్నటికీ వదులుకోలేను.” అని కోహ్లీ తెలిపారు.