టైటిల్ లుక్ ప్రీ లుక్‌తో అదరగొట్టిన విశాల్ - TNews Telugu

టైటిల్ లుక్ ప్రీ లుక్‌తో అదరగొట్టిన విశాల్actor vishal

తమిళ్ స్టార్ హీరో విశాల్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.  ఇటీవలే ‘ఎనిమీ’ ‘సామాన్యుడు షూటింగ్ ను పూర్తి చేసిన విశాల్.. ఇప్పుడు ఎ. వినోద్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో నటిస్తున్నారు.

ఇటీవల  విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ చెన్నైలోని ప్ర‌సిద్ద సాయిబాబా దేవాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఈ సినిమాకు అన్ని భాషలకు ఒకే టైటిల్ ఉండ‌నుందని తెలుస్తుంది. ఈ క్రమంలో టైటిల్ లుక్ ప్రీ లాంచ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ త‌ప్ప‌కుండా ప్రేక్షకులను అలరిస్తాయని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఫైట్ మాస్టర్ దిలిప్ సుబ్బరాయన్ డిజైన్ చేసిన దాదాపు 40 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ బ్లాక్స్ హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.