హెల్త్ హబ్ గా వరంగల్.. ఆస్పత్రి నిర్మాణానికి నిధులు విడుదల

Warangal as Health Hub
మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దడం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. సెంట్రల్ జైల్ స్థలంలో 33 అంతస్థుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.11 వందల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

జూన్ 21వ తేదీన 33 అంతస్తుల ఆస్పత్రి భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, వైద్యారోగ్య శాఖమంత్రి హరీష్ రావు కు ఓరుగల్లు ప్రజల తరుపున మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కృతజ్ఞతలు తెలిపారు.