శుక్రవారం, శనివారం ఈ ఏరియాల్లో మంచినీళ్లు బంద్

water supply Stopped In Some Areas In Hyderabad
water supply Stopped In Some Areas In Hyderabad

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి మంచినీటి స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ మంజీరా డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై స్కీం (ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌) ఫేజ్ – 2 కింద జరుగుతున్న మరమ్మత్తు పనుల కారణంగా నగరంలో రేపు కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోనుంది.

water supply Stopped In Some Areas In Hyderabad
water supply Stopped In Some Areas In Hyderabad

క‌లాబ్‌గూర్ నుంచి ప‌టాన్‌చెరు వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్‌సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌ లీకేజీ రిపేర్లు కొనసాగుతున్నాయి. దీంతో ఈ నెల 29, 30 రెండు రోజుల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో 36 గంటల పాటు వరకు మంజీరా డ్రింకింగ్‌ వాట‌ర్ స‌ప్లై స్కీం(ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌) ఫేజ్-2 ప‌రిధిలోకి వ‌చ్చే ప‌టాన్‌చెరు నుంచి హైద‌ర్‌న‌గ‌ర్ వ‌ర‌కు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

నీళ్లు సరఫరా బందయ్యే ఏరియాలివే..
1. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 9: హైద‌ర్‌న‌గ‌ర్‌, రాంన‌రేష్‌న‌గ‌ర్‌, కేపీహెచ్‌బీ, భాగ్య‌న‌గ‌ర్‌, వ‌సంత్ న‌గ‌ర్‌, ఎస్‌పీన‌గ‌ర్ తదిత‌ర ప్రాంతాలు
2. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 15: మియాపూర్‌, దీప్తిన‌గ‌ర్‌, శ్రీన‌గ‌ర్‌, మాతృశ్రీన‌గ‌ర్‌, ల‌క్ష్మీన‌గ‌ర్‌, జేపీ న‌గ‌ర్‌, చందాన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాలు
3. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 23: నిజాంపేట్‌, బాచుప‌ల్లి, మ‌ల్లంపేట‌, ప్ర‌గ‌తిన‌గ‌ర్‌
4. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 32: బొల్లారం