కండ్లద్దాలు వాడేవాళ్లు.. చేసే తప్పులివే.. మీరు కూడా చేస్తున్నారేమో చెక్ చేసుకోండి!

ways of cleaning specs and instructions of kepting it
ways of cleaning specs and instructions of kepting it

కండ్లద్దాలు పెట్టుకోవడం ఒకప్పుడు అవసరం. ఇప్పుడు ఫ్యాషన్. దూరంగా ఉన్న వస్తువులు, దగ్గరగా ఉన్న అక్షరాలు సరిగ్గా కనిపించకపోతే కండ్లద్దాలు పెట్టుకుంటారు. టూవీలర్ మీద వెళ్లేటప్పుడు కండ్లల్లో దుమ్ము ధూళి పడకుండా స్పెక్ట్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కి కొత్త కొత్త డిజైన్లు, కలర్స్ లో కండ్లద్దాలు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే.. కండ్లద్దాలు పెట్టుకోవడం మాత్రమే కాదు. అవి పెట్టుకున్నప్పుడు కొన్ని రూల్స్ పాటించాలని మీకు తెలుసా? మీకు తెలియకుండానే కండ్లద్దాల విషయంలో కొన్ని తప్పులు చేస్తారట చాలామంది. మరి మీరు కూడా ఆ తప్పులు చేస్తున్నారా? ఓ సారి చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. అసలు కండ్లద్దాలు వాడేవాళ్లు పాటించాల్సిన రూల్స్, జాగ్రత్తలు ఏంటంటే..


కండ్లద్దాలు పెట్టుకునే ముందు వాటిని మెత్తని క్లాత్ తో క్లీన్ చేయాలి. అంతే కాదు.. అద్దాలు తుడిచే క్లాత్ సెపరేట్ గా పెట్టుకోవాలి. చాలామంది తమ డ్రెస్ కి లేదా దుపట్టా కి.. అబ్బాయిలయితే షర్ట్ కి తుడిచేసి పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల మన ఒంటి మీద ఉన్న కంటికి కనిపించని దుమ్ము ధూళికణాలు గ్లాసెస్ పైకి చేరుతాయి. ఫలితంగా కంటి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. చాలామందికి కండ్లద్దాలు తుడిచి పెట్టుకోవాలనే సోయి కూడా ఉండదు. కొంతమందైతే.. ఓ కొద్దిసేపు అలా తుడుస్తూనే ఉంటారు. నిజానికి కండ్లద్దాలు ఎంతసేపు తుడవాలి అనే విషయం చాలామందికి తెలియదు. అయితే.. కండ్లద్దాలను కనీసం ఇరవై సెకన్ల పాటు తుడిస్తే చాలంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.


స్పెక్ట్స్ తుడవమంటే చాలామంది తడిగుడ్డతో శుభ్రంగా తుడుస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. తడిగుడ్డతో తుడవడం వల్ల అద్దాల మీద ఉన్న సన్నటి లేయర్లు డ్యామేజ్ అవుతాయి. అలా కాకుండా గోరువెచ్చటి నీళ్లు అద్దాలపై పోయాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న మెత్తటి మైక్రో ఫైబర్ క్లాత్ తో తుడవాలి. అద్దాలతో పాటు ఫ్రేమ్ కూడా నీట్ గా తుడవాలి.


కొందరు కళ్లద్దాలు శుభ్రం చేసేందుకు నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగిస్తారు. ఇది కరెక్ట్ కాదు. గోళ్లకు వేసుకునే నెయిల్ పోలిష్ రిమూవర్ లో అసిటోన్ అనే కెమికల్ పదార్థం ఉంటుంది. ఇది లెన్స్ లను పాడుచేస్తుంది. దీనిపెట్టి క్లీన్ చేసిన అద్దాలను ఉపయోగించడం వలన కళ్లు కూడా ఒత్తిడికి గురవుతాయి. చాలామంది కళ్ళద్దాలను జేబులోను, టేబుల్స్ పైన ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. వాటికోసం ప్రత్యేకం గా కేటాయించిన బాక్స్ లలో మాత్రమే వాటిని ఉంచాలి. కళ్లద్దాల పట్ల శ్రద్ధ వహిస్తేనే.. మన కళ్ళు పదిలంగా ఉంటాయి.