హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులతో గొప్ప విజయం సాధించబోతున్నాం

We are going to achieve great success in Huzurabad, says Harish rao

We are going to achieve great success in Huzurabad, says Harish rao

సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం , హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులతో గొప్ప విజయం సాధించబోతున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉప ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు చెబుతూ.. కష్టపడ్డ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యాన్ని చాటారని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం వారి చైతన్యానికి నిదర్శనమని చెప్పారు.

గత 4 నెలలుగా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి మార్గదర్శకంతో , హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదం తో గొప్ప విజయం సాధించబోతున్నామన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు మంత్రి హరీశ్.