ఈ వర్షాకాలం కూడా ధాన్యం కొనుగోలు చేస్తాం: సీఎం కేసీఆర్

CM KCR to chair TRS executive committee meeting on Today

 

గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  పోయిన సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఆ కేంద్రాలన్నింటీ ద్వారా యధావిధిగా ఈ సంవత్సరం కూడా ధాన్యం సేకరణ జరపాలని సీఎం పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సీఎం సూచించారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరపడానికి కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని సీఎం చెప్పారు.

సోమవారం ప్రగతిభవన్ లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంకవర్గీస్,  పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులున్నారు.