భీంగల్ లో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha

ఏడేండ్లలో దేశంలో నంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, ఇందుకు కేసీఆర్ కృషి, పట్టుదల కారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ భీంగల్ సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.

‘‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండుసార్లు ప్రజల ఆశీర్వాదంతో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పనిచేసే నాయకులకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటది. భీంగల్ పట్టణంలో త్వరలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం. భీంగల్ ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నాం. భీంగల్ లక్ష్మినారసింహ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్న. రాజకీయం కోసం మాట్లాడేవారు మాటలను ప్రజలు నమ్మొద్దు. మాటలతో అభివృద్ధి జరగదు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమనటం సరికాదు. తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలంటే టీఆరెస్ ని ఆదరించాలి. బాల్కొండను బంగారు బాల్కొండగా మార్చే బాధ్యత మాది.’’ అని అన్నారు.

మాయమాటలు చెప్పేవారిని నమ్మవద్దు

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరయోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఆలోచన, కృషి వల్లనే భీంగల్ మునిసిపాలిటీగా మారి అభివృద్ధిపథంలో నడుస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో భీంగల్ పట్టణం ప్రగతి సాధిస్తోంది. కేసీఆర్ ను కడుపులో పెట్టుకుంటున్న గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత మాదే. తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలవుతలేవు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేస్తలేరు. మాయమాటలు చెప్పేవారిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.