ఏపీకి తప్పిన ముప్పు.. తమిళనాడు వైపు మళ్లిన అల్పపీడనం

మళ్లీ తుఫాను వస్తుందేమో అని భయపడిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు ఊరటనిచ్చే వార్త చెప్పారు. నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారలేదు. అది కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండటంతో ఏపీకి వర్షాల ముప్పు తప్పిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు అల్పపీడనం కదులుతుండటంతో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


తాజా పరిస్థితులతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత కురిసే అవకాశాలు లేవు. ఈ రోజు నుంచి రేపు, ఎల్లుండి మాత్రం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 29 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.