బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ కి అస్వస్థత.. ఎయిమ్స్ లో చికిత్స

West Bengal Governor Jagadeep Dhankar Admitted In Aims Hospital With Sudden Illness
West Bengal Governor Jagadeep Dhankar Admitted In Aims Hospital With Sudden Illness

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఉన్నట్టుండి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను మధ్యాహ్నం మూడుగంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు.

West Bengal Governor Jagadeep Dhankar Admitted In Aims Hospital With Sudden Illness
West Bengal Governor Jagadeep Dhankar Admitted In Aims Hospital With Sudden Illness

ఈ మధ్యే ఆయనకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పలు పరీక్షలు చేయించారు. పరీక్షల్లో ఆయనకు మలేరియా సోకినట్టు వైద్యులు ధృవీకరించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన ఆయన ఈరోజు మరోసారి అస్వస్థతకు గురవడంతో వెంటనే ఎయిమ్స్ కి తరలించారు. ఎయిమ్స్ మెడికల్ డిపార్ట్ మెంట్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ నిశ్చల్ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతున్నది.