సునాయాసంగా గెలవాల్సిన ప్రకాష్ రాజ్.. అక్కడే లెక్క తప్పాడా.. మెగా ఫ్యామిలీనే కొంప ముంచిందా..!

Reasons For Prakash Raj Loss In Maa Elections 2021
Reasons For Prakash Raj Loss In Maa Elections 2021
Reasons For Prakash Raj Loss In Maa Elections 2021
Reasons For Prakash Raj Loss In Maa Elections 2021

భారతదేశంలోని భాషలన్నింటిలో నటించిన పాన్ ఇండియా స్టార్.. ఎన్నో జాతీయ అవార్డులు కొల్లగొట్టిన మహా నటుడు.. అద్భుత మాటకారి.. టన్నులకొద్దీ ట్యాలెంట్.. అన్నింటికీ మించి మెగా ఫ్యామిలీ అండ.. ఇన్ని కలిసొచ్చే అంశాలున్నాకా మా అధ్యక్షుడు ప్రకాష్ రాజ్ అవ్వటం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మా ఎన్నికల్లో మంచు విష్ణు చేతిలో అనూహ్యంగా ఓటమి చెందాడు ప్రకాష్ రాజ్. మీ తెలుగువాడినే గెలిపించుకున్నారుగా ఇక నేనెందుకు మీకు అంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేసి మోనార్క్ అనిపించుకున్నాడు ప్రకాష రాజ్.

అయితే సోషల్ మీడియాలో, సామాన్య జనాల్లో మంచు ఫ్యామిలీకి చాల నెగిటివిటి ఉంటుంది అని అంటుంటారు. వారిపై ఎన్నో మీమ్స్, ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. కానీ అవన్నీ మా ఎన్నికల్లో పనిచేయలేదు. మంచు ఫ్యామిలీ క్యాంపెనింగ్ చేసిన ప్రాంతాయ వాద నినాదం ప్రకాష్ రాజ్ ని అడ్డంగా బుక్ చేసింది. లోకల్, నాన్ లోకల్ నినాదం మంచు విష్ణుకి అన్ని విధాలా కలిసొచ్చింది. అయితే తెలుగు వాడు కాదన్న అంశం తనకి నెగిటివ్ అవుతుందని ఎప్పటినుండో అందరు హెచ్చరించినా దాని నుండి తప్పించుకోవడానికి ప్రకాష్ రాజ్ ఎక్కడ ప్రయత్నించకపోవటం.. తెలుగు లెజండరీ నటుల ఆశీర్వాదాలు తీసుకోకపోవటం, మెగా ఫ్యామిలీని నమ్ముకుని బలంగా ప్రచారం చేయకపోవటమే ప్రకాష్ ఓటమికి మూడు మూల కారణాలంటున్నారు.

లోకల్ నాన్ లోకల్ ఇష్యు..

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాదం, ఆత్మగౌరవ నినాదాలు బలంగా పనిచేస్తాయి. అప్పట్లో టిడిపిని స్థాపించి అఖండ విజయాలు దక్కించుకున్న ఎన్టీఆర్ దీనికి ఉదాహరణ. అచ్చం అదే ఫార్ములాని పాటించి మా ఎన్నికల్లో సక్సె అయ్యింది మంచు ఫ్యామిలీ. ప్రకాష్ రాజ్ పోటీలోకి దిగగానే తెలుగు సినీ పరిశ్రమకు చెందినవాడు కాదనే వాదనలు బలంగా వినిపించాయి. అయితే వీటిని తిప్పికొట్టడంలో ప్రకాష్ రాజ్ విఫలమయ్యాడని అంటున్నారు జనం. నేను తెలుగువాడిని కాకపోయినా, అంతకు మించి సేవ చేస్తా అని చెప్పుకోవటంలో విఫలమయ్యారు మోనార్క్. కృష్ణ, కృష్ణం రాజు, కోటశ్రీనివాస్ రావు, చలపతి రావు వంటి తెలుగు సీనియర్ నటులను కలిసి ఆశీర్వాదాలు తీసుకొని ప్రచారాం చేయించుకుంటే రిజల్ట్ మరోలా ఉండేదని ప్రచారం జరుగుతుంది. అదే ఆయన ఓటమికి ప్రధాన కారణమైందని చెప్పుకుంటున్నారు.

నాకెవ్వరి మద్దత్తు అవసరం లేదు..

సుస్వాగతం చిత్రంలోని ‘నేను మోనార్క్ ని నన్నెవ్వరు మోసం చెయ్యలేరు’ అనే తన డైలాగ్ ని అచ్చంగా ఫాలో అవ్వాలి అనుకున్నాడో ఏమో కానీ.. నాకు సీనియర్స్ మద్దత్తు అవసరం లేదు.. నేను ఎవ్వరిని మద్దత్హు అడగను అని సంచలన కామెంట్స్ చేశాడు ప్రకాష్ రాజ్. ఈ తొందరపాటు వ్యాఖ్యలు కూడా ప్రకాష్ రాజ్ ఓటమికి కారణమయ్యాయి అంటున్నారు. తనకు ఎవ్వరి మద్దతు అవసరం లేదని ఆయన చెప్పడం, ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం తీసుకోనని అనడం ప్రకాష్ రాజ్ కి శాపమయ్యాయి.

మెగా ఫ్యామిలీపై అతి నమ్మకం

ఇక ఈ కారణాలు ఒకఎత్తయితే.. మెగా ఫ్యామిలీపై అధికంగా ఆధారపడటం కూడా ప్రకాష్ రాజ్ కొంపముంచేసాయి అంటున్నారు నెటిజన్స్. మా సభ్యులందరికి మోహన్ బాబు స్వయంగా కాల్స్ చేసి ఓటు అడిగిన విషయం తెలిసిందే. అలా చిరంజీవి చేయగలరా.. పవన్ కళ్యాణ్ కూడా చేయలేదు. తెరవెనుక మద్దత్తు తప్పించి బాహాటంగా ఈ ఇద్దరు హీరోలు ముందుకొచ్చి మద్దత్తు తెలిపినుంటే ప్రకాష్ రాజ్ సునాయాసంగా గెలిచేవాడు అంటున్నారు. ఇక ఆఖరి నిమిషంలో నాగబాబు బరిలోకి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక  కోటశ్రీనివాస్ రావు వంటి సీనియర్ ఆర్టిస్టులని నాగబాబు దూషించటం కూడా ప్రకాష్ రాజ్ కి నెగిటీవ్ అయ్యింది అంటున్నారు. ప్రకాష్ రాజ్ మెగా అండ చూసుకునే తన శక్తి సామర్ధ్యాలపై ఫోకస్ పెట్టలేదని, అదే ఆయన పరాజయానికి మరో ముఖ్య కారణమైందని టాక్ నడుస్తోంది.