మమూలు పెట్రోల్, పవర్ పెట్రోల్ మధ్య తేడా ఏమిటి?

premium petrol

భారతదేశంలో సాధారణంగా మూడు రకాల పెట్రోలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో రెగ్యులర్ పెట్రోల్‌తో పాటుగా పవర్ పెట్రోల్‌ను కూడా విక్రయిస్తుంటారు. ధరల్లోనూ తేడా ఉంటుంది. అయితే, వీటి మధ్య తేడా ఎంటో, ఏ పెట్రోల్ కొట్టిస్తే లాభమవుతుందో అన్న సంశయం అందరిలో ఉంటుంది. దీని కథెంటో ఓ సారి చూద్దాం.

సాధారణంగా ప్రీమియం పెట్రోల్‌ను పవర్, స్పీడ్, ఎక్స్ ట్రా మైల్, హై స్పీడ్ వంటి పేర్లతో పిలుస్తారు. ఒక్కో కంపెనీని బట్టి ఈ పేర్లను వేర్వేరుగా నిర్ణయిస్తారు. ఇండియన్ ఆయిల్ ఇటీవలే హై ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్‌ను విడుదల చేసింది. ఇది సాధారణ పెట్రోల్ కంటే 15 రూపాయలు ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

petrol

ఆక్టేన్ విలువ అధికం

పెట్రోల్ గ్రేడ్‌ను దాని ఆక్టేన్ విలువను ఆధారంగా చేసుకొని వర్గీకరిస్తారు. మామూలు పెట్రోల్ ఆక్టేన్ విలువ 87 కాగా.. ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ విలువ 91గా ఉంటుంది. అధిక ఆక్టేన్ కలిగిన ఇంధనం ఎక్కువ కంప్రెషన్ రేషియోని కలిగి ఉంటుంది. దీని ఫలితంగా ఇంజన్‌ను స్టార్ట్ చేసే సమయంలో ఎక్కువ ఇంధనం కాలిపోదు. ఎక్కువ ఆక్టేన్ ఉన్న పెట్రోల్ ఇంజిన్ నాకింగ్, ఇంజిన్‌లో శబ్ధాలను తగ్గిస్తుంది.

Petrol, Diesel

ప్రీమియం పెట్రోల్.. వాటికే ప్రయోజనం

వాస్తవానికి ప్రీమియం పెట్రోల్ అధిక కంప్రెషన్ ఇంజన్లకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు శక్తివంతమైన ఇంజన్లు కలిగిన స్పోర్ట్స్ కార్లు, సూపర్ కార్లు, బైక్ లు మొదలైన వాటికి ఈ ప్రీమియం ఇంధనం ఉత్తమంగా ఉంటుంది. అయితే తక్కువ ఇంధన సామర్థ్యం కలిగిన ఇంజన్‌లను ఉపయోగించుకునే కమ్యూటర్ వాహనాలకు ఈ ఇంధనం పెద్దగా ఉపయోగపడదని వారు అభిప్రాపడుతున్నారు.