వాట్సాప్ లో చాటింగ్ ని దాచేయ్యాలా.. అయితే ఈ ఫీచర్ మీకోసమే

ఒకప్పుడు ఫోన్ కాల్ కాకుండా ఎవరికైనా ఏదైనా సమాచారం అందించాలంటే ఎస్ఎంఎస్ చేసేవాళ్లు. ఆ స్థానాన్ని వాట్సాప్ ఆక్రమించేసింది. ఛాటింగ్, ఇన్ఫర్మేషన్ షేరింగ్, వీడియో కాల్, వాయిస్ కాల్ ఇలా వాట్సాప్ లో ఎన్నో ఫీచర్లు ఉండటంతో అందరూ వాట్సాప్ వైపే మొగ్గారు. అయితే.. గర్ల్ ఫ్రెండ్, లవర్, ఫ్రెండ్, బిజినెస్ ఇలా ఏదైనా ఛాట్ ఎవరూ చూడకుండా దాచడం అప్పట్లో కుదరకపోయేది. దీంతో డిలీట్ చేయక తప్పేది కాదు. కానీ వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. అందులో ఒకటే వాట్సాప్ చాట్ ని దాచుకోవడం. మీ వాట్సాప్ లో కూడా ఏదైనా చాటింగ్ కొంతకాలం పాటు దాచుకోవాలనుకుంటే.. ఈ ఫీచర్ మీకోసమే..

వాట్సాప్ రకరకాల ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోవడంలో ఇతర సోషల్ మీడియా యాప్స్ తో నిత్యం పోటీ పడుతోంది. ఈ పోటీ వల్ల వాట్సాప్ యూజర్లు మాత్రం రకరకాల ఫీచర్లతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాప్ లో ఓ ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగంగా మారింది. అదే.. వాట్సాప్ చాట్స్ ని దాచుకోవడం.


వాట్సాప్ లో చాలా ఫీచర్లున్నాయి. వాటిలో యూజర్లకు తెలిసింది కొన్నే. కొంతమంది టెక్నికల్ నిపుణులు ఎప్పటికప్పుడు వాట్సాప్ ఫీచర్ల గురించి చెప్తూ.. యూజర్లకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఫీచరే మరొకటి అందుబాటులోకి వచ్చింది. అదే… ఆర్కైవ్ ఫీచర్. దీని వల్ల వాట్సాప్ లో ఏదైనా చాట్ దాచేయవచ్చు. ఈ మధ్యే ఆర్కైవ్స్ లో కొత్త సెట్టింగ్స్ కూడా వచ్చాయి.


వాట్సాప్ యూజర్లు తమ చాట్ ని హైడ్ చేయాలనుకుంటే.. ఈ ఫీచర్ వాడుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు దాచొచ్చు.. కావాలనుకున్నప్పుడు చూడొచ్చు. ఇందుకు వాట్సాప్ లో చాట్స్ ఆర్కైవ్ ని ఓపెన్ చేయాలి. అందులో చాట్ ని సెలెక్ట్ చేసుకోవాలి.


ఇప్పుడు రైట్ సైడ్ పిన్, మ్యూట్, డిలీట్, ఆర్కైవ్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో కిందివైపు బాణం గుర్తు ఉన్న ఐకాన్ ని క్లిక్ చేస్తే సెలక్ట్ చేసుకున్న చాట్ ఆర్కైవ్ అవుతుంది. వాట్సాప్ లో కుడివైపు కనిపించే మూడు చుక్కలను క్లిక్ చేస్తే.. ఆర్కైవ్డ్ సెక్షన్ కనిపిస్తుంది. దాంట్లో మనం ఆర్కైవ్స్ చేసిన చాట్స్ కనిపిస్తాయి. అయితే.. ఆర్కైవ్స్ చేసిన చాట్స్ మన రెగ్యులర్ లో చాట్ లిస్టులో కనిపించవు.


వాట్సాప్ లో చాట్స్ ని ఆర్కైవ్ చేయడం మాత్రమే కాదు. మళ్లీ కావాలనుకున్నప్పుడు అన్ ఆర్కైవ్ కూడా చేయొచ్చు. ఇందుకోసం వాట్సాప్ ఓపెన్ చేయాలి. టాప్ లో ఆర్కైవ్డ్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. మీరు ఆర్కైవ్ చేసిన చాట్స్ కనిపిస్తాయి. ఆన్ ఆర్కైవ్ సింబల్ క్లిక్ చేస్తే.. ఆర్కైవ్ చేసిన చాట్స్ మళ్లీ కనిపిస్తాయి.


వాట్సాప్ లో చాట్స్ ని ఆర్కైవ్ చేస్తే చాట్ డిలీట్ చేయడం కాదు. ఆ చాట్స్ బ్యాకప్ లేదా ఎస్డీ కార్డు నుంచి డిలీట్ కాకుండా సేవ్ అయి ఉంటాయి. కేవలం సింగిల్ చాట్స్ మాత్రమే కాదు. వాట్సాప్ గ్రూప్స్ ని కూడా ఆర్కైవ్ చేయొచ్చు. ఆర్కైవ్ చేసిన చాట్స్ కి నోటిఫికేషన్లు రావు.


వాట్సాప్ చాట్స్ ని డిలీట్ చేయడానికి, ఆర్కైవ్ చేయడానికి చాలా తేడా ఉంది. చాట్ ఎప్పటికీ అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు. మళ్లీ కావాలనుకుంటే ఆర్కైవ్ చేయాలి. ఒకవేళ వాట్సాప్ చాట్స్ బ్యాకప్ చేస్తే డిలీట్ చేసిన చాట్స్ బ్యాకప్ లోకి వెళ్లవు.