దెయ్యమే వికెట్ తీసిందా? అసలు ఏం జరిగిందీ? క్రికెట్ చరిత్రలోనే నెవర్ బిఫోర్..ఎవర్ ఆప్టర్ సీన్. - TNews Telugu

దెయ్యమే వికెట్ తీసిందా? అసలు ఏం జరిగిందీ? క్రికెట్ చరిత్రలోనే నెవర్ బిఫోర్..ఎవర్ ఆప్టర్ సీన్.క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చాలా విచిత్ర సంఘటనలు జరుగుతాయి. అద్భుతాలు, నమ్మశక్యం కాని ఫీట్లను బ్యాట్స్ మెన్స్, బౌలర్లు చేస్తుంటారు. ఇలాంటి ఎన్నో రికార్డులు క్రికెట్ లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే సంఘటన నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటుంది. అవును అది కెమెరాలో రికార్డు కాకపోయి ఉంటే ఓ మిస్టరీయే. అలా అని రికార్డైన విజువల్స్ చూస్తే కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. వివరాల్లోకి వెళితే హరారే వేదికగా ఇటీవల బంగ్లాదేశ్, జింబాబ్వే టీమ్ టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో 18 వ ఓవర్లో విచిత్ర సంఘటన జరిగింది. మహమ్మద్ సైఫుద్దీన్ బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ బాల్ వేస్తుండగానే వికెట్ పడింది.

ఎలా జరిగిందీ?

జింబాబ్వే బౌలర్ టెండాయ్ చతారా ఐదో బాల్ వేయకముందే..బెయిల్స్ వాటికవే పడిపోయాయి. ఇది చూడకుండా బ్యాట్స్ మెన్ వెనక్కి జరిగి ఫుల్ షాట్ ఆడాడు. అతను తగలకుండానే బెల్స్ పడ్డాయి.  దీంతో బ్యాట్స్ మెన్ ఆశ్చర్యపోయాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ ను సంప్రదించారు. రీప్లేలో బ్యాట్స్ మెన్ అసలు స్టంప్స్ కు తగలలేదన్నది సష్టంగా కనిపించింది. మరీ బెల్స్, వికెట్ ఎలా పడిందన్నది ఎవరికీ అర్థం కాలేదు.

ఇప్పటికీ మిస్టరీయే

ఈ సంఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. అసలు గాలికి బెల్స్ కదిలాయా అనుకుంటే అప్పుడు గాలి కూడా పెద్దగా లేదు. సరే బెల్స్ గాలికి కదిలి ఉంటాయి గానీ స్టంప్ ఏలా కదిలి ఉంటుందో అర్థం కాలేదు. ఆ టైమ్ లో పెద్దగా గాలి కూడా రాలేదు. దీంతో అంపైర్లు, ప్లేయర్లు అంతా షాక్ కు గురయ్యారు.

దెయ్యమే చేసి ఉంటదంటూ కామెంట్లు

ఈ మిస్టరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎప్పుడు జరగని ఇలాంటి సంఘటనను చూసి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కచ్చితంగా దెయ్యం పనేనని, దెయ్యమే మ్యాచ్ లో వికెట్ తీసిందంటున్నారు. ఆ దెయ్యం జింబాబ్వే సైడ్ ఉండటంతో మ్యాచ్ కూడా జింబాబ్వే గెలిచిందంటున్నారు. ఐతే ఇప్పటికీ అసలు ఆ మ్యాచ్ లో ఏం జరిగిందనేది మిస్టరీగా ఉంది.