మోడీ బాగోతం.. యోగిపై కుట్రలు.. అమిత్ షాకి బిగ్ షాక్.. బీజేపీలో కుమ్ములాటలు ?

who is next bjp prime minister candidate
who is next bjp prime minister candidate

తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకరకంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశాడనే చెప్పాలి. సహజంగా మోడీ కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది. బీజేపీ పార్టీకి గ్రౌండ్ బేస్ కూడా ఆర్ఎస్ఎస్ వర్గాలే. అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం బీజేపీలో ఏ పదవిలో అయినా ఒక వ్యక్తిని రెండు సార్లకి మించి కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా మోడీకి ఇదే ఆఖరి అవకాశమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మోడీ ఇక రాజకీయ నుండి రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకుంటారని.. మోడీ స్థానంలో మరో బలమైన నేతని ఆర్ఎస్ఎస్ ప్రధానిని చేస్తుందంటూ ప్రచారం నడుస్తుంది. బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ పాత్ర బహిరంగమే. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ ఎవర్ని ప్రధానిని చేయబోతుంది అని కూడా లెక్కలు నడుస్తున్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ తరువాత గుజరాత్ కి చెందిన అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీ పేర్లు ప్రధాని పదవి రేసులో బలంగా వినిపిస్తున్నాయి.

అయితే గడ్కరీ నిజాయితీపరుడు, నెమ్మదస్తుడు కావటంతో.. అమిత్ షా, యోగిలలో ఒకరు భవిష్యత్ ప్రధాని అంటున్నారు. ఇక ఈ ఇద్దరిలోను యోగి కంటే అమిత్ షాకే అవకాశాలు ఎక్కువని కూడా వాదనలు ఉన్నాయి. బీజేపీ బలానికి యూపీ రాష్ట్రం చాలా కీలకం. ఆ రాష్ట్రంలో పట్టున్న యోగిని కేంద్రంలోకి తీసుకెళ్తే అక్కడ బీజేపీ గ్రాఫ్ పడిపోవచ్చు. సెంట్రల్ పాలిటిక్స్ పై అమిత షా కంటే యోగికి అనుభవం తక్కువ. అందుకే ప్రస్తుతం ప్రధాని తరువాత పార్టీలో అంతటి బలమైన నేత అమిత్ షానే. అమిత్ షా కూడా ఎప్పటి నుండో ప్రధాని పీఠం కన్నేశాడని అంటున్నారు. గుజరాత్ సెంటిమెంట్ ప్రకారం తనకే ప్రధాని అవకాశం ఇవ్వాలంటూ ఆర్ఎస్ఎస్ తో ఎప్పటి నుండో మంతనాలు చేస్తున్నాడు. అయితే బీజేపీ తెరవెనుక ప్రధాని పీఠంపై ఇంత చర్చ జరుగుతుంటే.. తాజాగా పార్టీ లైన్ దాటి మోడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తానె భవిష్యత్ ప్రధాని అంటూ ప్రకటించేసుకున్నాడు.

ఇటీవల ఓ జాతీయ పత్రిక కూడా వచ్చే ఎన్నికలనాటికి నితిన్ అమిత్షాల మధ్యే పోటీ ఉంటుందని.. ఆర్ఎస్ఎస్ ఎవరికి మక్కువ చూపుతుందో వారే ప్రధాని అవుతారని.. ఒక కథనం కూడా ప్రచురించింది. మరి ఈ కథనం ఎఫెక్టో.. లేక మరేమో.. తెలియదు కానీ… ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ.. ఒకింత వేగంగానే స్పందిస్తూ.. వచ్చే సారి కూడా ముచ్చటగా మూడో దఫా ప్రధాని తానేనని మోడీ కుండబద్దలు కొట్టారు. తనకు విశ్రాంతి తీసుకోవాలన్న ఉద్దేశం అసలే లేదని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రధాని పదవి చేపడితే అంతా అయి పోయినట్లు కాదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఓ విపక్ష నాయకుడి మాటలను గుర్తు చేసుకున్నారు. `ఒకరోజు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు(శరద్ పవార్) నన్ను కలిసి `మోడీజీ.. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానిని చేసింది. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు?’ అని అడిగారు. రెండుసార్లు ప్రధాని అయితే అన్నీ సాధించినట్టేనని ఆయన అభిప్రాయంతో ఉన్నారు. కానీ మోడీ అందరికంటే చాలా భిన్నమని ఆయనకు తెలీదు. అందుకే వచ్చే సారికూడా ప్రధాని పదవిలో నేనే ఉంటే తప్పేముంది!“ అని మోడీ వ్యాఖ్యానించారు. ఇక దీనిని బట్టి.. ప్రధాని పీఠంపై జరుగుతున్న చర్చకు నరేంద్ర మోడీ ఇలా చెక్పెట్టారని అనుకోవాలా? లేక పదవిపై మోజుతోనే మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిండోచ్చని కూడా అంటున్నారు.