మెగా హీరోల్లో కలకలం.. ఎవరు నంబర్ వన్ హీరో.. సమీకరణాలు మార్చేసిన అల్లు అర్జున్…!

Who Is Number One Star In Mega Heroes
Who Is Number One Star In Mega Heroes

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. ఈ ఆరుగురు మెగా హీరోలు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ఈ ఆరుగురిలో ఎవరి స్టయిల్ వారిది. సాయి తేజ్, వరుణ్ తేజ్ లని పక్కన పెడితే.. చిరు, పవన్, చరణ్, బన్నీలకి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీరి సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి ఈ నలుగురిలో ఇప్పుడు ఎవరు పెద్ద.. నంబర్ వన్ ఎవరు.. చిరంజీవి తరువాత ఏ మెగా హీరోకి క్రేజ్ ఎక్కువుంది అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ముఖ్యంగా పుష్ప విడుదలయ్యాక ఈ చర్చ మరింత పెరిగింది. సొంత కష్టంతో మెగాస్టార్ రేంజికి ఎదిగిన చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లోను దుమ్ము దులుపుతున్నారు. యువ హీరోలకి పోటీనిస్తూ 100కోట్ల క్లబ్ ని ఈజీగా దాటేస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరోలు బాలయ్య, వెంకటేష్, నాగార్జునలకు అందనంతగా తన మార్కెట్ ని నిలబెట్టుకున్నాడు మెగాస్టార్.

ఇక మెగాస్టార్ తరువాత అంతటి క్రేజ్ దక్కించుకున్న హీరో పవన్ కళ్యాణ్. చిరంజీవి వారసత్వాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత కూడా పవర్ స్టార్ కే దక్కుతుంది. అన్నయ్య అడుగుజాడల్లో వెండితెరకి పరిచయమై.. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి వంటి బ్లాక్ బస్టర్స్ తో స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్.. ఖుషి మూవీతో అన్నయ్యనే మించిపోయాడు. ఖుషికి ముందువరకు పవన్ కి ఫ్యాన్సే ఉండేవాళ్ళు. ఖుషి తరువాత పవన్ కి భక్తులు ఏర్పడ్డారు. దాంతో ఇండస్ట్రీలోనే నంబర్ స్థానాన్ని దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక స్టార్ హీరోగా క్రేజ్ ఉన్నప్పుడే తన ఫోకస్ రాజకీయాల్లోకి షిఫ్ట్ చేయటం.. పాన్ ఇండియా చిత్రాలను చేయకపోవటంతో ఈ మధ్య టాలీవుడ్ మార్కెట్ లో కాస్త వెనుకపడ్డాడు పవన్ కళ్యాణ్. దాంతో ఇప్పుడు పోటీ మొత్తం చరణ్, బన్నీ మధ్యలోనే. ఇద్దరిలో మా హీరో నంబర్ వన్ అంటే మా హీరో నంబర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్. మగధీర, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటిన.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్థాయికి ఇంకా చరణ్ చేరుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ తో భారీ హిట్ కొట్టినా.. ఎన్టీఆర్ తో ఆ క్రెడిట్ పంచుకోవాలి. దీంతో మెగా హీరోల్లో నంబర్ రేసులో బన్నీ కంటే చరణ్ వెనుకపడిపోయాడని అంటున్నారు.

చిరంజీవి, పవన్ ఇమేజ్ కి అల్లు అర్జున్ గండి కొట్టాడని.. ఇప్పుడు మెగా హీరోల్లో నంబర్ వన్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ అని అంటున్నారు. గత రెండు చిత్రాలు అల్లు అర్జున్ ఇమేజ్ ఎక్కడికో తీసుకెళ్లాయి. అల వైకుంఠపురంలో మూవీతో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా అవతరించారు. పుష్ప అన్ని భాషల్లో కలిపి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా హిందీ వర్షన్ రూ. 81 కోట్ల గ్రాస్ రాబట్టి అబ్బురపరిచింది. బన్నీఇక బాలీవుడ్ లో ఇక జెండా పాతినట్టే. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ అవతరించినట్లే. తనలోని లోపాలు సరిచేసుకుంటూ, నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటూ అల్లు అర్జున్ ఈ స్తాయికి చేరాడు. నిన్నటి వరకు మెగా హీరోలలో పవన్ కళ్యాణ్ నంబర్ వన్. కానీ ఇప్పుడు అల్లు అర్జున్. పుష్ప మూవీతో అల్లు అర్జున్ సమీకరణాలు మార్చేశాడు. మెగా హీరోలలో ఎవరూ ఆయన సెట్ చేసిన రికార్డ్స్ టచ్ చేస్తారో.. అసలు టచ్ చేసే సత్త ఉందొ లేదో టైం డిసైడ్ చేస్తుంది.