ఏంటీ తమాషానా.. మేమంటే అంత చిన్నచూపా.. అమీర్ ఖాన్ పై సౌత్ సినీ ఫ్యాన్స్ సీరియస్.. అసలేంటి వివాదం ?

Why Aamir Khan Apologises To KGF 2 Team
Why Aamir Khan Apologises To KGF 2 Team

ఎంతకాదన్న.. సౌత్ సినిమా అంటే నార్త్ వాళ్ళకి చిన్నచూపే అన్నది సత్యం. బాహుబలికి ముందైతే  మన సౌత్ సినిమా స్టార్స్ ని బాలీవుడ్ మీడియా అస్సలు పట్టించుకునే వారే కాదు. కానీ సౌత్ సినిమా స్టార్స్ కి మాత్రం నార్త్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సౌత్ సినిమాలకు యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ దీనికి నిదర్శనం. బాలీవుడ్ హీరోల కంటే సౌత్ సినిమా హీరోలను పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటారు నార్త్ ప్రేక్షకులు. భారతదేశ కల్చర్ ని చూపెడుతూ నిజమైన సినిమాలు సౌత్ నుండే వస్తాయని మనపై ప్రశంసలు కురుపిస్తుంటారు హిందీ ఫ్యాన్స్. ముఖ్యంగా బన్నీ, విజయ్, దుల్కర్ సల్మాన్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, సూర్య, సుదీప్, విక్రమ్ వంటి హీరోల మాస్ పర్ఫార్మెన్స్ లని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కానీ అక్కడి బాలీవుడ్ హీరోలు మాత్రం ఇంకా సౌత్ పై చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని సోషల్ మీడియాలో కొత్త చర్చ ఒకటి నడుస్తుంది. దీనికి కారణం తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కేజిఎఫ్ చిత్రాన్ని తొక్కేయాలని చూస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.

బాహుబలి తరువాత బాలీవుడ్ కి చుక్కలు చూపెట్టిన చిత్రం కేజీఎఫ్‌. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మించి కలెక్షన్స్ కొల్లగొట్టింది కేజీఎఫ్‌. దీంతో కేజీఎఫ్‌ 2ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ సంజయ్ దత్ వంటి హిందీ నటుడిని పెట్టుకొని ఒక సంవత్సరం ముందరే విడుదల తేదీని కూడా ప్రకటించేశారు కేజీఎఫ్‌ మూవీ టీమ్. కానీ ఇప్పుడు తాజాగా కేజీఎఫ్‌ విడుదలవుతున్న తేదీ రోజే అమీర్ ఖాన్ ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాని విడుదల చేస్తున్నట్టు అమీర్ ఖాన్ ప్రకటించేశాడు. చెప్పాపెట్టకుండా అనౌన్స్ చేయటమే కాకుండా ‘ఇది తప్పటం లేదు.. కావాలని చెయ్యటం లేదు.. అనివార్య పరిస్థితుల్లో మీ కేజిఎఫ్ రిలీజ్ రోజే మేము మా సినిమాని విడుదల చేయాల్సివస్తుంది.. మమ్మల్ని క్షమించండి’ అంటూ అమీర్ సన్నాయి నొక్కులు నొక్కి చెప్తున్నాడు. కానీ ఇదంతా బాలీవుడ్ వాళ్ళు కావాలనే చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అమీర్ ఖాన్ సినిమాకి దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. నార్త్ లోని టాప్ థియేటర్స్ అన్ని కూడా లాల్ సింగ్ చెడ్డ కోసం బ్లాక్ చేసి.. సెకండ్ గ్రేడ్ థియేటర్స్ కేజిఎఫ్ కి వచ్చేలా.. కలెక్షన్స్ కి దెబ్బేసే ప్రణాళికలో భాగంగానే అమీర్ ఖాన్ అండ్ టీమ్ ఇలా చేస్తున్నారని కేజిఎఫ్ హీరో యష్ ఫ్యాన్స్, కన్నడ అభిమానులు సోషల్ ,మీడియాలో విమర్శిస్తున్నారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రం ఏప్రిల్‌ 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే అదే రోజు(ఏప్రిల్‌ 14) కేజీఎఫ్‌ 2 కూడా విడుదల కానుంది. ఈ తేదిని గతంలో కేజీఎఫ్‌ 2 బృందం ఎప్పుడో ప్రకటించింది. ఈ చిత్రంపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్‌ వసూళ్లను షేర్‌ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమిర్‌ ఖాన్‌ ‘కేజీఎఫ్‌ 2’టీమ్‌కు క్షమాపణలు చెప్పారు. తాజాగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తప్పనిసరి పరిస్థితిలో ఏప్రిల్‌ 14న లాల్‌సింగ్‌ చద్దాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం. విడుదల తేదీని ప్రకటించే ముందు ‘కేజీఎఫ్‌2’ నిర్మాత విజయ్‌ కిరంగదుర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, హీరో యశ్‌లకు క్షమాపణ చెబుతూ లేఖ రాశా. ‘కేజీఎఫ్‌ 2’కు నేనే స్వయంగా ప్రచారం చేస్తా. ఆ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఏప్రిల్‌ 14న థియేటర్స్‌లో ఆ సినిమా చూస్తా’అని ఆమిర్‌ తెలిపారు. మరి ఒకే రోజున వస్తున్న ఈ రెండు చిత్రాలలో ప్రేక్షకులు దేనికి బ్రహ్మరథం పడతారో చూడాలి.