మెగా పార్టీలో బన్నీ కలకలం.. చిరు ఇంటికి ఎందుకు పోలేదు.. ఆ విభేదాలు నిజమేనా.. కనీసం భార్య కూడా వెళ్లలేదేంటి..!

Why Allu Arjun Not Attended Megastar Chiranjeevi Birthday Party
Why Allu Arjun Not Attended Megastar Chiranjeevi Birthday Party
Why Allu Arjun Not Attended Megastar Chiranjeevi Birthday Party
Why Allu Arjun Not Attended Megastar Chiranjeevi Birthday Party

చిరు బర్త్ డే, రాఖి పౌర్ణమి రెండు పండగలు ఒకేసారి రావటంతో మెగా స్టార్ ఇంట్లో జరిగిన వేడుకలతో మీడియా మొత్తం హోరెత్తిపోయింది. మెగా ఆడపడుచులతో పాటు రెండు తరాల హీరోలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అంతా కలిసి తెగ సందడి చేశారు. కానీ ఆ మెగా వేడుకలో ఒక్కటే వెలితి. అరె అందరు కనిపిస్తున్నారు మన హీరో ఎక్కడ అంటూ ఫ్యాన్స్ లో చిన్న కలవరం. ఆయన డుమ్మా కొట్టడానికి కారణమేంటి.. కావాలనే రాలేదా..మెగా ఫ్యామిలీతో ఏవైనా విభేదాల.. లేక నిజంగానే బిజీ షెడ్యూల్ కారణమా.. ఇలా సోషల్ మీడియాలో ఆ హీరోపై రూమర్స్ క్రియేట్ అయిపోయాయి.

మరి ఆ హీరో ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్.. హీ ఈజ్ బన్నీ. మెగా ఫ్యామిలీ ఏకమై కన్నులపండుగగా చేకూసున్న పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డుమ్మా కొట్టడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు కావాలనే బన్నీ రాలేదని, బన్నీ మెగా హీరోల్లా కాదని, బన్నీనే రియల్ మెగాస్టార్ అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేయటంతో ఈ చర్చ సోషల్ మీడియాలో మరింత హీట్ పెంచింది. అయితే మెగాస్టార్ ఇంట్లో అంతపెద్ద ఈవెంట్ కి అల్లు అర్జున్ రాకపోవటం ఏంటి, అంత ఓకే నేనా అంటూ సోషల్ మీడియాలో ఎన్నో డౌట్స్. ఒకవేళ బన్నీ షూటింగ్ లో బిజీగా ఉంటే కనీసం భార్య స్నేహ అయినా హాజరవ్వాలిగా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్న సందర్భంగా బన్నీ ఎందుకు రాలేదన్న దానిపై కొంచం క్లారిటీ వచ్చింది.

ప్రధానంగా బన్నీ రాకపోవటానికి పుష్ప షూటింగే కారణమని అల్లు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా పుష్ప షూటింగ్ డిలే అవుతూ వస్తుందని అందుకే ఈ షెడ్యూల్ ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ పడకుండా బన్నీ ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇలా పుష్పా కోసం వెరైటీ లుక్ మెయింటైన్ చేస్తున్న బన్నీ అది రివీల్ కావొద్దని కూడా చిరు పార్టీకి రాలేదని మరో న్యూస్ వస్తుంది. అందుకే మెగాస్టార్ పార్టీకి బన్నీ రాలేకపోయాడని అంటున్నారు. ఇక కరోనా కారణంతో బన్నీ భార్య స్నేహ కూడా తమ పిల్లలతో పార్టీకి రాలేదని అంటున్నారు.

ఇక బన్నీ రాలేకపోవడానికి కారణం ఏదైనా.. అందరు అనుకుంటున్నట్టు మెగా ఫ్యామిలీతో విభేదాలు మాత్రం కాదని స్పష్టం చేస్తున్నారు. మామయ్య చిరంజీవి అంటే అల్లు అర్జున్ కి అత్యంత అభిమానమని, చిరంజీవి పై తనకున్న గౌరవం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటాడు బన్నీ. అందుకే మెగా ఫ్యామిలీతో విభేదాల కారణంతోనే, మరే ఇతర కారణంతోనో మెగా పార్టీకి బన్నీ డుమ్మా కొట్టే అవకాశం లేదని.. ఖచ్చితంగా తన షూటింగ్ బిజీ  కారణంగానే చిరంజీవి బర్త్ డే వేడుకలకి వెళ్లలేకపోయాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.