తాతకి జరిగిన అవమానం.. ఎన్టీఆర్ లో ఇంకా రగులుతుందా.. అందుకే ఎన్టీఆర్ ని బాబు టార్గెట్ చేశాడా.. రాజుకున్న కొత్త చర్చ..!

Why Chandrababu Fans Targets Jr Ntr In Social Media
Why Chandrababu Fans Targets Jr Ntr In Social Media

జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పష్టమైన విమర్శలు చేయలేదు.. చంద్రబాబు, భువనేశ్వరిల పేర్లు ఎందుకు ఎత్తటం లేదు.. వల్లభనేని వంశీ, కోడలి నానిలని తీవ్రంగా ఎందుకు తప్పుపట్టలేదు.. డిప్లమాటిక్ గా కాకుండా సూటిగా మాట్లాడకపోవడానికి కారణం ఏంటి.. నందమూరి ఫ్యామిలి స్పందించినంత ఘాటుగా ఎందుకు ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వలేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇదే. చంద్రబాబు కన్నీళ్లపై ఎన్టీఆర్ స్పందించిన తీరుని కొందరు టార్గెట్ చేస్తూ వీడియోస్ కూడా వదులుతున్నారు. మేము నీ అభిమానులమని చెప్పుకోడానికి సిగ్గేస్తుంది అంటూ ఎన్టీఆర్ ని వాయించేస్తున్నారు. అయితే ఇదంతా కూడా కావాలనే టీడీపి శ్రేణులు ప్రణాళిక ప్రకారం ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తున్నాయని కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఘత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ట్రాప్ లో పడకూడదనే ఎన్టీఆర్ ఈ విధంగా స్పదించాడని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ అవమానం జరిగింది చంద్రబాబుకి కాదు.. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరికి అని.. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ లతో పాటు నందమూరి కుటుంబస్తులంతా కొడాలి నాని, వంశీ పేర్లు ఎత్తి మరి తీవ్రంగా హెచ్చరించారని.. ఇకపై చంద్రబాబు ఆపిన మేము మిమ్మల్ని వదిలిపెట్టమని.. నేరుగా నాని, వంశీలకు వార్ణింగ్ ఇచ్చింది నందమూరి ఫ్యామిలీ.

ఇక దీంతో స్విట్జర్లాండ్ షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ కూడా స్పదించాలంటూ ఒత్తిడి పెరగటంతో అక్కడి నుండే వీడియో సందేశం పంపించాడు ఎన్టీఆర్. కానీ ఈ స్పందనపై మాత్రం టీడీపీ చంద్రబాబు ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుంతుంది. అందుకే మనుషులని పెట్టి అదే పనిగా జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టిస్తున్నారని నెట్టింలో వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ని సమర్థిస్తూ కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. తన తాత నందమూరి తారకరామారావు కి చంద్రబాబు వెన్నుపోటుపొడిచి, చెప్పులు వేయించిన ఘటనని బాలకృష్ణ లాంటివారు మరిచిపోయినా .. ఎన్టీఆర్ మాత్రం గుర్తుపెట్టుకున్నాడని.. తన తాతకి చంద్రబాబు చేసిన అవమానం దృష్టిలో పెట్టుకునే ఎన్టీఆర్ ఆచితూచి స్పదించాడని.. నిజమైన ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని.. మిగితావారంతా పెద్ద ఎన్టీఆర్ ని అవమానించిన చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారని ఇంకో యాంగిల్ లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా చంద్రబాబు కన్నీళ్ల కంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ రియాక్షన్ పై సోషల్ మీడియాలో చర్చ ఎక్కువగా నడుస్తుంది.