నెల రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులే ఎందుకు వస్తుంది? దీని వెనుక సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు చేసే కథేంటీ!

మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రతి నెల మనం మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు 28 రోజుల వాలిడిటీనే కంపెనీలు ఇస్తుంటాయి. అరె నెల రోజుల కోసం రీఛార్జ్ చేయాలనుకుంటే ఇదెంద్రా భాయ్ ఇట్లా చేస్తున్నారని మనం చాలుసార్లు అనుకునే ఉంటాం. ఇక చేసేదీ కూడా ఏమీ లేదన్న ఉద్దేశంతో సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు ఎన్ని రోజులు రీఛార్జ్ కు అవకాశం ఇస్తే అంతే మనకు ప్రాప్తం అనుకుంటాం. కానీ కంపెనీలు ఇలా ఎందుకు చేస్తాయి. నెల రోజుల పిరయడ్ కు రీఛార్జ్ చేయకుండా ఈ 28 రోజుల కథేంటీ అంటే దాని వెనుక పెద్ద స్ట్రాటజీయే ఉంది. అవును వినియోగదారులను దోచుకోవటం..కంపెనీలు భారీగా లాభాలను పొందేందుకే ఇదోరకం ఎత్తుగడ.

Mobile phone SIM cards

ఏటా 13 సార్లు రీఛార్జ్ చేయించేలా ప్లాన్

ఈ 28 రోజుల వాలిడిటీకి ఎలాంటి సాంకేతిక పరమైన కారణాలు గానీ గవర్నమెంట్ రూల్స్ గానీ లేవు. పక్కా లాభాలు గడించేందుకు అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ తెలివిగా చేసిన స్ట్రాటజీయే. ఎందుకంటే వినియోగదారుడికి నెల రోజులకు ఒక్కసారి రీఛార్జ్ కి అవకాశం కల్పిస్తే ఏడాదికి 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేస్తారు. కానీ ఇలా 28 రోజుల ప్లాన్ చేయటంతో వినియోగదారులంతా కచ్చితంగా ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఏడాది 365 రోజులను 30 తో డివైడ్ చేస్తే ఇంచుమించు 12 వస్తుంది. కానీ 28 తో డివైడ్ చేస్తే 13.03 నెలలు అవుతాయి. అంటే వినియోగదారుల నుంచి ఒక్క నెల రీఛార్జ్ ఎక్కువగా చేయించే ప్లాన్ అన్నమాట. ఈ నెల 3 మంత్స్, 6 మంత్స్ ప్లాన్ లలో కూడా వినియోగదారుల నుంచి డబ్బులు గుంజే పని చేస్తుంటారు. ఈ మోసంలో ఆ కంపెనీ ఈ కంపెనీ అని ఏమీ లేదు. అన్ని కంపెనీలు కలిసి కట్టుగానే వినియోగదారులను దోచుకుంటున్నాయి.

వినియోగదారులకు దిక్కులేని పరిస్థితి

ఇప్పుడు మొబైల్ వాడని వ్యక్తులే లేరు. దేశంలో దాదాపు 80 శాతం మందికి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. వీరందరూ కచ్చితంగా రీఛార్జ్ చేయించాల్సిందే. అన్ని కంపెనీలు ఇలాగే 28 రోజుల విధానం పెట్టటంతో వినియోగదారులు కూడా ఏం చేయాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ చాలా మంది నెల రీఛార్జ్ అంటే 28 రోజులేనని అలవాటు పడిపోయారు. ఇదన్న మాట 28 రోజుల వాలిడిటీలో ఉన్న దోపీడి కహానీ.