ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. హుజురాబాద్ బరిలో 30 మంది

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గుడువు ఇవాళ్టితో ముగిసింది. 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 30న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుండగా.. నవంబర్‌ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.