గ్యాస్ సిలిండర్ కి దండం పెట్టి ఓటు వేయడానికి బయల్దేరుతున్న మహిళలు

Women fined for gas cylinder and set out to vote

Women fined for gas cylinder and set out to vote

హుజూరాబాద్‌లో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్‌ కేంద్రాలకు తరలుతున్నారు. కొందరు మహిళలు గ్యాస్‌ సిలిండర్‌కు దండం పెట్టుకుని ఓటేయడానికి వెళ్తున్నారు. త్వరలోనే సిండర్‌ బండ ధర రూ.వెయ్యికి చేరనున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మహిళలు తమ ఓటుతో కేంద్రానికి బుద్ది చెబుతామని అంటున్నారు.

గత కొన్నిరోజులుగా పెట్రోల్‌, డీజిల్‌తోపాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలను మోయలేమని, మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లాల్సి వస్తున్నదని సామాన్య ప్రజలు వాపోతున్నారు. గ్యాస్ బండకు దండంపెట్టి.. కేంద్రంలోని బీజేపీ పార్టీకి తమ వ్యతిరేకతను తెలియజేయాలని మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో సూచించిన విషయం తెలిసిందే.