ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికులు అత్యాచారాలు చేస్తున్నారంటూ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఓ మహిళ అర్థనగ్నంగా నిరసన తెలిపారు. కేన్స్ రెడ్ కార్పేట్ పై హఠాత్తుగా తన డ్రెస్ తీసి నిరసన తెలిపారు. స్టాప్ అజ్ రేపింగ్ అంటూ ఆమె గట్టిగా అరిచారు. శరీరంపై స్టాప్ రేపింగ్ అజ్ అని రాసుకొచ్చారు. వెంటనే అలర్టైన సిబ్బంది ఆమెకు డ్రెస్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను బయటికి పంపించారు. త్రీ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ లాంగింగ్ చిత్రం ప్రీమియర్ కోసం ఏర్పాటు చేసిన రెడ్‌కార్పెట్ సమయంలో ఈ ఘటన జరిగింది.