ప్రపంచానికి అంత అప్పుందా? ఐఎంఎఫ్ నివేదిక లో షాకింగ్ విషయాలు - TNews Telugu

ప్రపంచానికి అంత అప్పుందా? ఐఎంఎఫ్ నివేదిక లో షాకింగ్ విషయాలుజీవితంలో అప్పు చేయటమనేది సహజం. మన అవసరాలకు సరిపడా డబ్బు లేనప్పుడు అప్పు చేస్తూ ఆ తర్వాత దాన్ని తీరుస్తుంటాం. అలా వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు, రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తుంటాయి. ఆయా స్థాయిల్లో వారి అప్పుల లెక్క ఉంటుంది. అలా ఈ మొత్తం ప్రపంచానికి ఎంత అప్పుందో తెలుసా! దాదాపు 226 లక్షల కోట్ల డాలర్లు. అవును ఈ లెక్క మొత్తం ప్రపంచ దేశాల అప్పు. తాజాగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) విడుదల చేసిన నివేదిక ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఐతే గతంతో పోల్చుకుంటే అన్ని దేశాల అప్పు విపరీతంగా పెరిగింది. కరోనా ఎఫెక్ట్ ప్రపంచాన్ని అప్పుల్లో ముంచేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది.

ప్యాకేజీ, ఉద్దీపనలతో పెరిగిన అప్పు

కరోనా ఎఫెక్ట్ ను కంట్రోల్ చేసేందుకు చాలా దేశాలు కొత్త పాలసీలు, ఉద్దీపన పథకాలు, ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాయి. వాటి కారణంగా అన్ని దేశాల అప్పు భారీగా పెరిగింది. ప్రపంచానికి ఉన్న 226 లక్షల కోట్ల డాలర్ల అప్పు లో 90 శాతం బలమైన ఆర్థిక వ్యవస్థలుగా పేరున్న దేశాలవే. 2020 తర్వాత అన్ని దేశాల అప్పు 27 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. మన దేశానికి సంబంధించి 2016లో మొత్తం జీడీపీలో 68.6 శాతంగా ఉన్న అప్పు 2020 నాటికి 89.6 శాతానికి చేరుకుంది. 2026 నాటికి ఈ అప్పు 85.2 శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.