వ్యాక్సిన్ వేసుకున్నా.. మాస్క్ పెట్టుకోవాల్సిందే : డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్

world health organisation
world health organisation

కరోనా తీవ్రత తగ్గిపోయిందని.. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని మాస్క్ పెట్టుకోవడం పట్ల నిర్లక్ష్యం చేయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గోబ్రియస్ హెచ్చరించారు. ఐరోపాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని.. టీకాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్లు వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని మరిచిపోవద్దని ఆయన తెలిపారు.

World Health Organisation Director Warns About wearing mask
World Health Organisation Director Warns About wearing mask

వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా రాదనే తప్పుడు భావనను ఆలోచనల్లోంచి తీసేయాలని టెడ్రోస్ తెలిపారు. దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ -19 వేరియంట్ గురించి చర్చించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా దక్షిణాఫ్రికాలో కొత్త జాతిని కనుగొన్నట్లు ధృవీకరించింది. విదేశాల్లో కరోనా కేసులు పెరగడంతో భారత్ అప్రమత్తమైంది. యూరప్, ఆఫ్రికాల నుంచి వచ్చే ఫ్లైయర్లను కఠినమైన స్క్రీనింగ్, టెస్టింగ్ చేయాలని నిర్ణయించింది. దీనిక సంబంధించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.