వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

నర్సాపురం వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణంరాజు ను ఏపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రఘురామపై ఏపి సిఐడి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెక్షన్‌ 124B కింద కేసు నమోదు చేశారు.  సెక్షన్‌ 50 కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబసభ్యులకు నోటీసులు ఇచ్చారు.

రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ని అడ్డుకునేందుకు సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయత్నించింది. సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సిఐడి పోలీసులు సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజు ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన్ని మంగళగిరి సిఐడి కార్యాలయానికి తరలించారు.

30మంది ఏపీ పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారని ఎంపీ కుమారుడు భరత్ ఆరోపించారు. ఏపీ పోలీసులు తమకు ఎలాంటి నోటీసులు ఇయ్యకుండానే అరెస్ట్ చేశారన్నాడు. ఈ రోజు రఘు రామ కృష్ణంరాజు పుట్టిన రోజు అని కుమారుడు భరత్ తెలిపాడు.