Home క్రైమ్ ఆంటీ మాట్లాడటం లేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

ఆంటీ మాట్లాడటం లేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

వివాహిత తనతో మాట్లాడటం మానేసిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్న దుర్గేష్ అనే యువకుడు బోయిన్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో పనిచేయడానికి వెళ్లిన క్రమంలో ఓ వివాహితతో పరిచయం అయింది. గత రెండేండ్లుగా ఇద్దరూ తరచుగా మాట్లాడుకుంటున్నారు.

ఉన్నఫళంగా సదరు వివాహిత కొన్ని రోజులుగా దుర్గేష్ తో మాట్లాడటం మానేసింది. తీవ్ర మనస్థాపానికి గురైన దుర్గేష్ మహిళ ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాలా సేపయినా ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వివాహిత ఇంట్లోకి వెళ్లి చూడటంతో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.