Monday, May 13, 2024

పెళ్లిలో తాత డ్యాన్స్‎కు ఫిదా కావాల్సిందే.. వీడియో వైరల్

spot_img

సోషల్ మీడియాలో పెళ్లికి సంబందించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు మాత్రమే వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వృద్ధులు చేసే డ్యాన్స్‎లు జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో వృద్ధుడు చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Read also: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

ఈ వీడియోలోని ఓ వృద్ధుడు పెళ్లి వేడుకలో యువకులతో కలిసి వేదికపై నృత్యం చేయడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. భోజ్‌పురి పాట విన్న వెంటనే వృద్ధుడి లోపల ఉన్న యువకుడు బయటికి వచ్చాడు. ఆపై స్టేజ్ మీద ఉన్న యువకులతో కలిసి ఓ రేంజ్‎లో స్టెప్స్ వేశాడు. వృద్ధుడి డ్యాన్స్ ప్రతిభ ముందు యువకుల ప్రదర్శన కూడా దిగదుడుపే అని చెప్పవచ్చు. ప్రదర్శన సమయంలో వృద్ధుడి ముఖంలో చిరునవ్వు చెక్కుచెదరకుండా ఉంది. అన్నీ మర్చిపోయి తాత చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest News

More Articles