Monday, May 13, 2024

మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయ మూర్తి ప్రాణాలను నిలబెట్టింది..!

spot_img

సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి రాత్రి 10 గంటల సమయంలో  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో న్యాయ మూర్తి సుజాత తీవ్రంగా గాయపడింది. దీంతో పోలీసులు ప్రధమ చికిత్స కోసం సుజాత ను సూర్యాపేట ఏరియా ఆసుపత్రి కి తరలించారు.

Also Read.. ఖైదీ నంబర్‌ 7691.. నేడు ఏపీ బంద్ కు టీడీపీ పిలుపు

ఆ సమయంలో తిరుమలగిరిలో  ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి  జగదీష్ రెడ్డి విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఏరియా ఆసుపత్రి కి చేరుకుని సుజాత ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడంతో , వెంటనే మూడు జిల్లాల ఎస్పీలని అలెర్ట్ చేసి, సూర్యాపేట నుండి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి పై ఉన్న పోలీసు స్టేషన్ సిబ్బంది ని ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు.

Also Read.. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. కుప్పకూలిన లిఫ్ట్, ఏడుగురు కార్మికులు మృతి.!!

ఓ వైపు జోరు న వర్షం కురుస్తుండటంతో  ఇబ్బందులు తలెత్తకుండా సుజాత గారిని తరలించే అంబులెన్స్ ను  తన కాన్వాయ్ మధ్య లో ఉంచి రక్షణగా హైదరాబాద్ కు తరలించారు. మంత్రి సమయస్పూర్తితో కేవలం గంట పదిహేను నిమిషాలలో సుజాతను హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం న్యాయ మూర్తి సుజాత ఓ  ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సకాలంలో సుజాత ను హైదరాబాద్ తరలించడం మంచి పరిణామం అని వైద్యులు తెలిపారు. న్యాయవాదిగా  న్యాయమూర్తి సుజాతను హైదరబాద్ కు తరలించిన మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తిని న్యాయవాదులు, ప్రజలు కొనియాడుతున్నారు.

Latest News

More Articles