Tuesday, May 21, 2024

8 రోజుల్లో రూ. 600 కోట్లు వసూల్ చేసిన ‘యానిమల్’

spot_img

అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ న‌టించిన ‘యానిమల్’ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా విడుద‌లైన మొద‌టిరోజు నుంచే ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను ప‌రుగులు పెట్టిస్తుంది. వీక్ డేస్‎లోనూ హౌల్​ఫుల్​ షోస్​తో ప్రదర్శితమవుతూ కాసుల వర్షం కురిపిస్తోంది.

రీసెంట్‌గా 500 కోట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ సినిమా.. తాజాగా 8 రోజుల‌కు గాను రూ. 600 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఎనిమిదో రోజైన శుక్ర‌వారం ఒక్క హిందీలోనే రూ. 21.56 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది.

అంతేకాకుండా.. ఈ సినిమా ఇప్పుడు ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఏడు భారతీయ చిత్రాలలో నిలిచింది. ఉత్తర అమెరికాలో ఈ సినిమా 10 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది.

Latest News

More Articles