Monday, May 13, 2024

అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ జడ్జి కూతురు మృతి..!

spot_img

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ యువతి మృతి చెందింది. డల్లాస్‌‎కు 25 కిలోమీటర్ల దూరంలోని అలెన్‌ మాల్‌లోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో నిందితుడు సహా తొమ్మిది మంది మరణించగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన తాటికొండ ఐశ్వర్య కూడా ఉన్నారు. అలెన్ ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చొరబడ్డాడు. అక్కడ ఉన్న వారి మీద తుపాకీతో విరుచుకుపడ్డాడు.

ఈ ఘటనలో రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె అయిన ఐశ్వర్య కూడా ఉన్నారు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఆమె కొన్నాళ్ల క్రితమే టెక్సాస్‎ వెళ్లారు. ఐశ్వర్య మృతిని అమెరికాలోని తెలుగు సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌ రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ అని సమాచారం.

అలెన్‌ మాల్‌లో జరిగిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డ్‌ కూడా మరణించారు. మాల్‌లోకి ప్రవేశించే ముందు ఓ పోలీసు అధికారిని కూడా దుండగుడు కాల్చి చంపాడు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అప్పటికే కాల్పులు జరుతున్న అంగతకుడిని కాల్చివేశారు. కాల్పుల ఘటన సమయంలో మాల్‌లో వందలాది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.

Latest News

More Articles