Monday, May 13, 2024

ఓం భీమ్ బుష్ బ్యూటీ అయేషాను కలవరిస్తోన్న కుర్రకారు..!

spot_img

అయేషా ఖాన్..టాలీవుడ్ దూసుకుపోతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. హిందీ బిగ్ బాస్ ద్వారా వచ్చి క్రేజ్ తో తెలుగులో చక్కటి ఛాన్సులు కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ అయేషా ట్రెండింగ్ లో ఉంది. ముంబైలో పుట్టిన అయేషా బుల్లితెరపై జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను షురూ చేసింది. హిందీ బిగ్ బాస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ టు టాలీవుడ్ జర్నీ కొనసాగిస్తోంది.

ఈమధ్యే విడుదలైన ఓం భీమ్ బుష్ మూవీలో అల్లరి పిల్లగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ మూవీలో నటించింది కొద్దిసేపే అయినప్పటికీ కుర్రాళ్లకు కలల రాణిగా మిగిలింది. ఈ అమ్మడి గ్లామరస్ పాత్రలకు యువత ఫిదా అయిపోయింది. అంతేకాదు ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ బ్యూటీగా నిలిచింది. ఇక టాలీవుడ్ వరుస సినిమాలకు సైన్ కూడా చింది. విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఐటెం సాంగ్ లో అదరగొట్టింది. దుల్కర్ సల్మాన్ మూవీ లక్కీ భాస్కర్ లోనూ మరో స్పెషల్ సాంగ్ లో ఈ బ్యూటీ అదరగొట్టనుంది.

సోషల్ మీడియాలో అయేషాకు ఫ్యాన్ ఫాలోవర్స్ ఎక్కువే. తరచుగా హాట్ ఫొటోలు, వీడియోలు పెట్టి సందడి చేస్తుంది. పాటలకు రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ను తెగ అలరిస్తుంది. సందేశాత్మక వీడియోలు పెడుతూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఓం భీమ్ బుష్ తో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు త్వరలోనే మరో రియాల్టీ షోలో పాల్గొననుంది.

ఇది కూడా చదవండి: ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేసిన ఈడీ అధికారి కపిల్ రాజ్ ఎవరు?

Latest News

More Articles