Monday, May 20, 2024

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ  సీఎంకు బట్టికి అవమానం

spot_img

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమత్రి బట్టి విక్రమార్క కు అవమానం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చో బెట్టారన్నారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాట్లాడిన బాల్క సుమన్…రేవంత్ రెడ్డి సతీమణినీ పైన కూర్చోబెట్టి బిసీ బిడ్డ అయిన కొండా సురేఖను క్రిందా కూర్చోబెట్టారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.. ఎక్కడ చెప్పుకోవాలి.. ఎవరికి చెప్పుకోవాలి.కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకుడైనా బట్టి విక్రమార్కనే అవమానించారు. 74 యేండ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతోంది. యావత్ దళిత జాతిని ఈరోజు అవమానించారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుండి బట్టి విక్రమార్క ఫొటో పక్కన పెడుతున్నారు. ప్రభుత్వ యాడ్స్ లో బట్టి విక్రమార్క ఫొటోను పక్కన పెట్టారు. జరిగిన ఘటన పై నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి ఏంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విసూనురి రామచంద్ర రెడ్డి,ఎర్రపహడ్ ప్రతాప్ రెడ్డి లాంటి వారు రేవంత్ రెడ్డి… బట్టి విక్రమార్కకు జరిగిన అవమానం పై కాంగ్రెస్ పార్టీ హై కామండ్ స్పందించాలన్నారు. దళితుడైన మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు ఉన్నారు .భట్టికి జరిగిన అవమానం పై స్పందించాలిన్నారు. గతం లో కుల సంఘం మీటింగ్ లో బీసీ లు, ఎస్సీలకు పాలన చేత కాదు అని రేవంత్ మాట్లాడారు. కులసంఘం మీటింగ్ లో చెప్పినట్టే రేవంత్ పాలనా ధోరణి ఉందన్నారు. భట్టి కి జరిగిన అవమానకరపు ఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూడాలన్నారు.

ఇది కూడా చదవండి: ఎస్‌బీఐ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం.. రేపటిలోగా డేటా ఇవ్వాల్సిందే.!

Latest News

More Articles