Monday, May 20, 2024

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డబుల్ డిజిట్ పక్కా..!

spot_img

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు రావడం ఖాయమన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే బలం ఉందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులు బలమైనవారు అయినందునే కాంగ్రస్, బీజేపీ పోటీపడి బీఆర్ఎస్ నాయకులను ఆయా పార్టీల్లో చేరుకుని బరిలోకి దింపాయని మండిపడ్డారు ఆ రెండు పార్టీలు పోటీ పడేది ముమ్మాటికీ బీఆర్ఎస్ తోనే అన్నారు. ఈ ఎన్నికల్లో అంచనాలకు మించి పార్టీ విజయాలను నమోదు చేసుకుంటాంని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీతో పోరాడేది బీఆర్ఎస్ పార్టే: హరీశ్ రావు
అటు బీఆర్ఎస్ తోనే బీజేపీకి పోటీ అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకే లాభం చేకూరుతుందన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. మైనార్టీల పిల్లల చదువుల కోసం రెసిడెన్షియల్‌ సూళ్లను 204 పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: అక్షయతృతీయ రోజు నవగ్రహ శాంతి కోసం చేయాల్సిన దానాలు ఇవే..!!

 

Latest News

More Articles