Sunday, May 12, 2024

న్యూడ్ మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. బీటెక్ స్టూడెంట్ అరెస్ట్

spot_img

హైదరాబాద్: అందమైన అమ్మాయిల ఫోటో పెట్టి ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్న బీటెక్ చదివే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్ చదివే యువకుడు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తూ.. అమ్మాయిలను వలలో వేసుకుంటున్నాడు. చాలామంది అమ్మాయిలు, యువతులు వారి వలలో పడ్డారు.

Also Read.. త్వరలో మౌలాలి- హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ రైళ్లు

అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని వ్యక్తిగత ఫోటోలు తెప్పించుకుని, వాటితో న్యూడ్ మార్ఫింగ్ ఫోటోలు తయారు చేసి అమ్మాయిలను బెదిరిస్తున్నాడు. ప్రతిరోజు న్యూడ్ ఫోటోలను పంపాలని డిమాండ్ చేయడంతో.. ఒక కార్పొరేట్ స్కూల్ విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బీటెక్ యువకుడిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వారితో తమ వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకోవద్దని అమ్మాయిలకు పోలీసులు సూచించారు.

Latest News

More Articles