Monday, May 13, 2024

ప్రజలకు పాయాఖానా నీళ్లు తాపించిన ఘనత కాంగ్రెస్ పాలకులది..!

spot_img

రాష్ట్రవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన మంచి నీటి పండుగ సంబరాలలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ‘సూర్యాపేట కు పాయాఖానా నీళ్లు తాపించిన ఘనత కాంగ్రెస్ పాలకులకు దక్కుతుందని ఎద్దేవాచేశారు. అటువంటి నేతలు కాలి యాత్రా,మోకాలి యాత్ర,అంటూ మరోమారు ప్రజల్ని మోసం చెయ్యడానికి ఓ దండు బయలు దేరిందన్నారు.అటువంటి యాత్రలలో పాల్గొంటున్న నేతలు ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తూన్నారని ఆయన నిలదీశారు.

2014 కు ముందు త్రాగు నీటి కోసం కుళ్ళాయిల వద్ద కొట్లాట, బిందెడు నీళ్ళకోసం తండ్లాట, గుక్కెడు నీటి కోసం ముష్టి ఘాతుకాలు,పోలీస్ స్టేషన్ల పాలు, కేసులు కాంప్రమైజ్ లు అంటూ వీధులపాలైన సందర్భాలను ఆయన ఉటంకించారు. అటువంటి దౌర్బగ్య స్థితి నుండి బయటపడి సురక్షిత మైన నీటితో అభివృద్ధి, సంక్షేమం లో భాగస్వామ్యం అయిన ప్రజల్ని మోసం చేయడానికే ఆ యాత్రలు అంటూ ఆయన మండిపడ్డారు. జీవనదులు పారుతున్నా,వాటిపై తెలంగాణా కు హక్కులు ఉన్నా,సీమాంధ్ర నేతలకు దడుసుకుని గుక్కెడు నీళ్లతో గొంతులు తడపని నైజం నాటి కాంగ్రెస్ పాలకులదంటూ ఆయన విరుచుకుపడ్డారు’ మంత్రి జగదీశ్ రెడ్డి.

Latest News

More Articles