Monday, May 13, 2024

తెలంగాణ వ్యాప్తంగా.. సీఎం కేసీఆర్ కి రైతుల పాలాభిషేకాలు

spot_img

నేడు రైతుబంధు నిధులు విడుదలయ్యాయి. 11వ విడత రైతు బంధు నిధులు ఈరోజు రైతుల ఖాతాల్లో పడగానే తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. తెలంగాణ రైతులంతా కేసీఆర్ ని రైతుల రారాజుగా అభివర్ణిస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో ఈ రోజు రైతుబంధు పెట్టుబడి సహాయం రైతుల అకౌంట్ ల లో పడటంతో సంతోషంతో తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రైతులు పాలాభిషేకం చేశారు. రైతులకు పెట్టుబడి ఇచ్చి రైతును రాజు చేస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కీర్తిస్తున్నారు ముఖరా కె రైతులు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోలేదని, రైతుల బ్రతుకులు మార్చిన పథకం రైతుబందు అని, రైతులకు పెట్టుబడి ఇచ్చి రాజును చేస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, జన్మంతా సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్ర పటాలను ప్ల కార్డులను ప్రదర్శిస్తూ జైజై కేసిఆర్ అంటూ నినాదాలు చేశారు రైతులు. నేడు రైతుబందు జమ అవ్వడంతో వ్యవసాయ క్షేత్రం లో ముఖ్యమంత్రి చిత్రపటానికి డప్పులు వాయిస్తూ పాలాభిషేకం చేసిన రైతులు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, తిరుపతి, మాదవ,వెంకటి రైతులు పాల్గొన్నారు.

Latest News

More Articles