Monday, May 13, 2024

కరువుపై సర్కార్ మొద్దు నిద్ర..!

spot_img

రైతు కంట కన్నీరు వస్తే..అది పాలకులకు మంచిది కాదన్న సంగతి తెలిసిందే. రైతులు తలచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి.ఆరుగాలం కష్టపడి…పండించిన పంట చేతికి వస్తుందన్న సమయంలో ఎండిపోతే..ఆ రైతు పడే కష్టాన్ని మాటల్లో చెప్పలేము. సాగునీళ్లు వస్తాయన్న ఆశతో యాసంగి సాగు చేసిన రైతులు ఆగమయ్యారు. ప్రాజెక్టుల నీళ్లు వదలక పంటన్నీ ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడగంటి బోర్లలలో నుంచి చుక్క నీరు వస్తలేదు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఎండిన పంటలు పోను పొట్ట దశకు వచ్చిన వరిపంటనైనా కాపాడుకుందామనుకుంటే రైతులపై ప్రక్రుతి కూడా పగ బట్టింది. అకాల వర్షాలతో నోటి కాడి బుక్కను నేలరాల్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ లో సుమారు 66 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 51లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం యాసంగి పంటలకు నీళ్లు అందించలేదు. సాగు నీటి కొరతతోపాటు ఇప్పటికే సుమారు 15లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. మరో 10లక్షలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎండిన పంటలకు కొందరు రైతులు నిప్పుకూడా పెట్టారు. మరికొందరు పశువులను మేపుతున్నారు. ఆదివారం కురిసిన వడగంట్ల వర్షాలతో పలు జిల్లాలో భారీ విస్తీర్ణంలో వరిపంట, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో రైతులకు అండగా ఉండాల్సిన సర్కార్ మొద్దునిద్రలో ఉన్నారు. రైతులను పట్టించుకుంటున్న పాపాన పోలేదు. వారికి కనీసం భరోసా కూడా ఇచ్చే పాలకుడే కరువయ్యాడు. అటువైపు కన్నెత్తి కూడా చూడటం లుదు. అధికారులు, ప్రభుత్వా ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తేరుకుని సర్వే చేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అగ్నివీర్ దరఖాస్తులకు రెండు రోజుల్లో ముగియనున్న గడువు.!

Latest News

More Articles