Tuesday, May 21, 2024

నలుగురు ఫ్రాన్స్ వ్యక్తులకు పద్మ అవార్డులు

spot_img

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న మాక్రాన్.. దేశ సైనిక బలంతో పాటు, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

Read Also: ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌.. ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ చేసిన హైదరాబాద్‌ కుర్రాడు

అయితే 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 132 మందికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వీరిలో ఫ్రాన్స్‌కు చెందిన నలుగురు ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం. షార్లెట్ చోపిన్, కిరణ్ వ్యాస్, పియర్ సాల్విన్ ఫిలిజోట్, ఫ్రెడ్ నెగ్రీట్ లు పద్మ అవార్డులు అందుకున్నారు. షార్లెట్ చోపిన్ యోగా మరియు ఆయుర్వేద రంగంలో చేసిన కృషికి గాను ఆమెను ఈ అవార్డుతో సత్కరించారు. అదేవిధంగా సాహిత్యం, విద్యా రంగంలో చేసిన కృషికి గాను పియర్ సిల్వైన్ ఫిలియోజాట్ పద్మ అవార్డుకు ఎంపికయ్యారు. కిరణ్ వ్యాస్ కూడా యోగా రంగంలో చేసిన విశేష కృషికి సత్కరించబడగా, ఫ్రెడ్ నెగ్రిట్ ఐడీయాలజీలో సాధించిన విజయాలకు పద్మ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సెలబ్రిటీలందరికీ ఫ్రాన్స్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వారు తమ విజయాలతో ఫ్రాన్స్, ఇతర దేశాల ప్రజలను చైతన్య పరిచారు. అందుకే ఫ్రాన్స్‌కు చెందిన ఈ ప్రముఖులందరికీ పద్మశ్రీ గౌరవాన్ని ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

Latest News

More Articles