Sunday, May 12, 2024

గూగుల్ పే లో కరెంట్ బిల్లులకు అనుమతి

spot_img

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గూగుల్ పే తన విద్యుత్ బిల్లు చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ యాప్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ బిల్లులను చెల్లించడానికి వీలు కల్పించింది గూగుల్ పే. ఈ నేపథ్యంలో Google Pay రాష్ట్ర యాజమాన్యంలోని రెండు విద్యుత్ బిల్లర్‌లతో భాగస్వామ్యం చేసుకుంది. అందులో ఒకటి నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) కాగా మరొకటి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL).

వీటి సహకారంతో Google Pay రాష్ట్రంలోని వినియోగదారుల కోసం చెల్లింపు ఎంపికలను విస్తరిస్తూ.. యాప్ ద్వారా విద్యుత్ బిల్లులను సజావుగా సెటిల్ చేసుకునేందుకు అధికారం ఇస్తుంది. ఇక డిటిహెచ్, ఇంటర్నెట్, గ్యాస్, ఫాస్టాగ్, ప్లే రీఛార్జ్ మరియు విద్యుత్‌తో సహా వివిధ బిల్లులు చెల్లించడానికి ఎక్కువ మంది వినియోగదారులు గూగుల్ పే ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవడంతో డిజిటల్ చెల్లింపుల స్వీకరణలో తెలంగాణ రాష్ట్రం అందరికంటే ముందున్నట్టు ప్రకటించింది.

Latest News

More Articles