Sunday, May 12, 2024

26 నుంచి గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

spot_img

ఈ నెల(మే) 26 నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల(జూన్) 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మే 25న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు.

మే 26న ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహన సేవ తో ప్రారంభం కానున్న శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…జూన్‌ 3న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణంతో ముగియనున్నాయి.

Latest News

More Articles