Monday, May 20, 2024

ఉప్పల్ జనసంద్రం.. పండుగలా టెస్టు మ్యాచ్..!

spot_img

హైదరాబాద్‌ భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్‌ మైదానంలో మూడ్రోజులగా పండుగ వాతావరణం నెలకుంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గుతున్న తరుణంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌కు ఎన్నడు లేని విధంగా అభిమానులు పోటెత్తుతున్నారు. హైదరాబాద్‌ ఆతిథ్యమిచ్చిన తొమ్మిది టెస్టుల్లో ఎన్నడూ 20 వేలకు మించి ఫ్యాన్స్‌ స్టేడియంకు రాలేదు. అయితే, జగన్‌మోహన్‌రావు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుకు కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌ తరహాలో ఫ్యాన్స్‌ పోటెత్తుతున్నారు. తొలి రోజు ఆటకు సుమారు 24 వేల మంది స్టేడియానికి రాగా, రెండో రోజు ఆటకు ఏకంగా 30 వేల 886 మంది, మూడో రోజు 30 వేల 598 మంది హాజరవ్వడంతో గత రికార్డులన్ని తుడిచి పెట్టుకుపోయాయి. ఈ మధ్య కాలంలో దేశంలో జరిగిన ఏ టెస్టు స్కూల్ స్టూడెంట్లకు, ఆర్మీ, నేవీ, వైమానికి దళానికి హెచ్‌సీఏ ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు మ్యాచ్‌ నిర్వహణపై విస్తృతంగా ప్రచారం చేయడంతో స్టేడియం జనసంద్రమవుతోంది.

స్టేడియానికి విచ్చేస్తున్న అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు స్వయంగా మైదానంలోని అన్ని స్టాండ్లను తనిఖీ చేశారు. ఒక దగ్గర సమోసాలు అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిసి, అతడిని హెచ్చరించి బయటకి పంపించేశారు. ఆతర్వాత సాయుధ దళాల ఉద్యోగులు, వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి, సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వారు ఉచితంగా అనుమతించడం, తాగునీరు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్కూల్‌ స్టూడెంట్స్‌ వద్దకు వెళ్లి, ఉచిత భోజనం సరిగ్గా అందుతుందో లేదో పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. వారంతా సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ప్రత్యక్షంగా మ్యాచ్‌ చూసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

More Articles