Tuesday, May 21, 2024

ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీ ప్రభాకర్‌ రావు రాజీనామా

spot_img

హైదరాబాద్‌: తెలంగాణలోని స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (SIB) లోయాంటీ నక్సల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి ప్రత్యేక అధికారి (OSD) గా ఉన్న మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ టీ ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు అయిన ప్రభాకర్‌ రావు మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేసి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు.

ఇటీవల ఓఎస్‌డీ ప్రభాకర్‌ రావుపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర పరిణామాలను అనుభవిస్తావని హెచ్చరించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ట్రాన్స్‌ కో, జెన్‌ కో సీఎండీ డీ ప్రభాకర్‌ రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిలు కూడా తన పదవులకు రాజీనామా చేశారు.

Latest News

More Articles